Share News

సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:19 PM

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉత్పత్తినైనా జనాలకు చేరువ చేయడానికి మార్కెటింగ్ అనేది అతి ముఖ్యమైనది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది రకరకాల వినూత్న ఆలోచనలతో వీడియోలు రూపొందించి ప్రమోట్ చేస్తున్నారు.

సూపర్.. మార్కెటింగ్ అంటే ఇలా ఉండాలి.. ప్లాస్టిక్ టబ్‌లు ఇంత గట్టిగా ఉంటాయా..
Innovative marketing ideas

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉత్పత్తినైనా జనాలకు చేరువ చేయడానికి మార్కెటింగ్ అనేది అతి ముఖ్యమైనది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది రకరకాల వినూత్న ఆలోచనలతో వీడియోలు రూపొందించి ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ప్లాస్టిక్ టబ్‌లు ఎంత దృఢంగా ఉంటాయో చూపిస్తున్నాడు (viral marketing video).


@TansuYegen అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోడ్డు పక్కన ప్లాస్టిక్ టబ్‌లను వరుసగా పెట్టి విక్రయిస్తున్నాడు. వాటిల్లో ఒక టబ్‌ను బయటకు తీసి అది ఎంత గట్టిగా ఉందో డెమో ఇస్తున్నాడు. ముందుగా అతడు టబ్‌పై రాయి విసిరాడు. ఆ తర్వాత ఆ టబ్‌తో రోడ్డుపై పలుసార్లు గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత బస్సు చక్రం కింద ఆ టబ్‌ను పెట్టాడు. అయినప్పటికీ ఆ టబ్ మాత్రం విరిగిపోలేదు (creative marketing).


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (smart branding). ఇప్పటివరకు దాదాపు ఏడు లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 7 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది తదుపరి స్థాయి మార్కెటింగ్ అని ఒకరు కామెంట్ చేశారు. 'నన్ను నమ్మండి, మిగిలినవి అంత బలంగా ఉండవు' అని మరొకరు పేర్కొన్నారు. ఇది నమ్మశక్యంగా లేదని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..


వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..

Updated Date - Jan 27 , 2026 | 03:49 PM