Share News

వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:10 PM

కప్పలు, ఎలుకల వంటి జంతువులను పాములు ఆహారంగా తీసుకుంటాయి. అయితే పాముల వేటకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చేపను పాము అసాధారణ రీతిలో పట్టుకుంది.

వావ్, పాములకు ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. నీటిలోని చేపను ఎలా పట్టుకుందో చూడండి..
snake catches fish

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. కప్పలు, ఎలుకల వంటి జంతువులను పాములు ఆహారంగా తీసుకుంటాయి. అయితే పాముల వేటకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చేపను పాము అసాధారణ రీతిలో పట్టుకుంది (snake hunts fish viral video).


@NatureChapter అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలో ప్రవహిస్తున్న నీటిలో ఈ వేట ప్రక్రియ సాగింది. పైన వేలాడుతున్న తాడుపై ఉన్న పాము నీటిలోని చేపను పట్టుకుంది. ఆ చేప కాస్త పెద్దదిగా ఉండడంతో సులభంగా పాముకు లొంగలేదు. దీంతో ఆ పాము తాడుపై నుంచి నీటిలో పడిపోయింది. అయినా ఆ పాము తన పట్టు సడలించలేదు. నీటిలో కూడా చేపను వదల్లేదు. పాము ఇలా చేపను వేటాడడం చాలా అరుదనే చెప్పాలి (snake hunting fish river).


ఈ వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది (snake catches fish). ఈ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. మునిగిపోతున్న చేపను ఆ పాము కాపాడుతోందని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. 'వావ్.. పాములు ఇలా కూడా వేటాడగలవా' అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోను మొదటి సారి చూస్తున్నానని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో కనిపెట్టండి..


చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..

Updated Date - Jan 26 , 2026 | 04:58 PM