చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:57 PM
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన జనరల్ జాంగ్ యూక్సియా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత్త స్థాయి అధికార హోదాలో ఉన్నారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చైనా అణు రహస్యాలను అమెరికాకు లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
అగ్రరాజ్యం అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్ చేశారనే కారణంతో ఓ శక్తివంతమైన అధికారిపై దర్యాఫ్తు జరుగుతోందని సమాచారం. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన జనరల్ జాంగ్ యూక్సియా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత్త స్థాయి అధికార హోదాలో ఉన్నారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జాంగ్‌పై అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. చైనా అణ్వాయుధ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కీలక టెక్నికల్ డేటాను జనరల్ జాంగ్ అమెరికాకు లీక్ చేశారని ఆ కథనంలో ఆరోపించింది. అలాగే చైనా మిలిటరీ విభాగానికి సంబంధించి ప్రమోషన్ల విషయంలో కూడా జాంగ్ భారీగా లంచాలు తీసుకున్నారని, ఆయుధ పరికరాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని పేర్కొంది. ఈ విషయం బయటపడడంతో ఆయనపై చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని తెలిపింది.
ప్రస్తుతం జాంగ్‌పై దర్యాఫ్తు జరుగుతున్నట్టు వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి వెల్లడించినట్టు వాల్‌స్ట్రీట్ పేర్కొంది. ఈ కథనం తర్వాత సోషల్ మీడియాలో మరిన్ని ఆరోపణలు షికార్లు చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాటుకు జాంగ్ ప్రయత్నం చేశారని, దీంతో జాంగ్‌తో పాటు మరికొందరు సీనియర్ జనరల్స్‌ను నిర్బంధించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చైనా ప్రభుత్వం యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో దాక్కున్న ముగ్గురిని 10 సెకెన్లలో కనిపెట్టండి..
వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..