Share News

వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:54 PM

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు.

వార్నీ.. వాషింగ్ మెషిన్‌ను ఇలా కూడా వాడతారా.. గోధుమలను ఎలా ఆరబెడుతోందో చూడండి..
unusual wheat drying method

మనదేశంలో చాలా మంది సామాన్యులు అసామాన్యంగా ఆలోచిస్తుంటారు. క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు. తమ రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తమ తెలివితో పరిష్కరిస్తుంటారు. ఇతరులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (indigenous wheat drying idea).


jyottimalik అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. గోధుమలను సాధారణంగా ఎండలో ఆరబెడతారు. దీనికి చాలా సమయం, స్థలం అవసరం. ఎండ రాకపోతే మరింత కష్టం. అందుకే ఓ మహిళ వినూత్నమైన ప్లాన్ వేసింది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే వాషింగ్‌మెషిన్‌ను గోధుమలను ఆరబెట్టడానికి ఉపయోగిస్తోంది. గోధుమలను బాగా కడిగేసి వాషింగ్ మెషిన్ డ్రయర్‌లో వేసింది. దీంతో నిమిషాల వ్యవధిలోనే గోధుమలు చాలా వరకు ఆరిపోయాయి. ఈ సూపర్ ట్రిక్ చాలా మందిని ఆకట్టుకుంటోంది (wheat drying viral video).


ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (desi jugaad farming). ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. 3 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇది స్మార్ట్ హోమ్ ట్రిక్ అని చాలా మంది కామెంట్లు చేశారు. వాషింగ్ మెషిన్‌ను ఇలా దుర్వినియోగం చేయడం అన్యాయం అని మరొకరు సరదాగా పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్

మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్

Updated Date - Jan 25 , 2026 | 04:13 PM