వామ్మో.. ఇదెక్కడి ప్రేమ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తుందట..
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:58 PM
థాయిలాండ్‌లోని నఖోన్ ఫానోమ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ అసాధారణ ప్రేమకథ సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫా అనే 24 ఏళ్ల యువతి ఒకేసారి ఇద్దరు కవల సోదరులతో డేటింగ్ చేస్తోంది. సువా, సింగ్ అనే ఇద్దరు కవల సోదరులతో ఫా చాలా కాలంగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తోంది.
థాయిలాండ్‌లోని నఖోన్ ఫానోమ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ అసాధారణ ప్రేమకథ సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫా అనే 24 ఏళ్ల యువతి ఒకేసారి ఇద్దరు కవల సోదరులతో డేటింగ్ చేస్తోంది. సువా, సింగ్ అనే ఇద్దరు కవల సోదరులతో ఫా చాలా కాలంగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తోంది. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమిస్తున్నారు. ఆమె కూడా ఆ ఇద్దరినీ గాఢంగా ప్రేమిస్తోంది. ఈ ప్రత్యేకమైన సంబంధానికి రెండు కుటుంబాల ఆమోదం కూడా లభించింది (dating twin brothers viral).
ఆ కవల సోదరులు ఇద్దరితోనూ ఫాకు శారీరక సంబంధం ఉంది. ముగ్గురూ ఇంటి పనులు, ఖర్చులు, బాధ్యతలను పంచుకుంటారు. ఫా ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తూ నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తుంది. సువా, సింగ్ వ్యవసాయ యంత్రాలతో పని చేస్తారు. వారిద్దరూ తమ మొత్తం సంపాదనను ఫాకు అప్పగిస్తారు. ఇంటి ఖర్చులు, పొదుపు, అవసరాలను ఫా పర్యవేక్షిస్తుంది. అయితే ఇటీవల ఫా సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది (unusual love story).
తాను గర్భవతినైతే బిడ్డ తండ్రి ఎవరో డీఎన్ఏ పరీక్ష ద్వారా తెలుసుకుంటుందట (DNA test father pregnancy). బిడ్డ జీవ సంబంధమైన తండ్రిని గుర్తించి బర్త్ సర్టిఫికెట్‌లో అతడి పేరు రాయిస్తుందట. అయితే పుట్టిన బిడ్డ సువా, సింగ్ ఇద్దరినీ 'పాపా' అనే పిలవాలట. థాయ్ చట్టం ఏకపత్నీవ్రతను గుర్తిస్తున్నప్పటికీ, ఒకరితో కంటే ఎక్కువ మందితో డేటింగ్ చేయడం చట్టవిరుద్ధం కాదు. ఏదేమైనా సువా, సింగ్‌లతో ఫా బంధం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో కనిపెట్టండి..
చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..