జంక్‌ఫుడ్ ప్రచారంపై పరిమితులు.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు బ్యాన్ చేయాలి..
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:24 PM
అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో తెలిసిందే. దేశంలో ఊబకాయులు, మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్‌స్టైల్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది.
అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి ఎంత కీడు చేస్తాయో తెలిసిందే. దేశంలో ఊబకాయులు, మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్‌స్టైల్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని సూచించింది (ultra-processed food ads ban).
జంక్‌ఫుడ్‌తో పాటూ చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్‌పై కూడా ఆంక్షలు విధించాలని సూచించింది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఆహార వినియోగాన్ని తగ్గించే అంశం గురించి ఈ సర్వే ద్వారా ప్రస్తావించారు. పిజ్జా, బర్గర్, నూడిల్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు కలుగ చేసే దీర్ఘకాలిక వ్యాధుల గురించి ప్రస్తావించారు ( survey recommendation food marketing).
ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 వరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించాలని, ఆహార పదర్థాల తయారీలో ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర ఏ మోతాదులో వినియోగించారో తెలిపే న్యూట్రిషన్ లేబుల్‌ను ప్యాకెట్లపై ముద్రించాలని ఈ సర్వే సూచించింది (junk food ad restrictions).
2009-23 మధ్య జంక్ ఫుడ్ వినియోగం 150 శాతానికి పైగా పెరిగిందని, మహిళలు, పురుషుల్లో ఊబకాయం దాదాపు రెట్టింపు అయిందని ఈ సర్వే తెలిపింది. 2006లో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల రిటైల్ విక్రయాలు 0.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2019 నాటికి అది దాదాపు 40 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఈ సర్వే వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
విచిత్రం, 1966లో తులం బంగారం కంటే తాజ్ హోటల్‌లో బస చేయడమే ఎక్కువ ఖరీదు..
మీ కళ్ల షార్ప్‌నెస్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో బల్లిని 15 సెకెన్లలో కనిపెట్టండి..