Sri Ramulu: రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై అనుమానాలు..
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:00 PM
రాజశేఖర్ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.
- పూడ్చే సంప్రదాయం ఉన్నా.. మృతదేహాన్ని కాల్చారు
- మాజీ మంత్రి శ్రీరాములు
బళ్లారి(బెంగళూరు): బ్యానర్ వివాదంలో నెలకొన్న హింసాత్మకమైన ఘటనలపై ఐదు రోజులుగా నగరంలో ఇరు పార్టీ నాయకులు మీడియా సమావేశంలో ఒకరై ఒకరు ఆరోపణ అస్త్రాలు సందిస్తున్నారు. జరిగిన ఘటన పరిణామాలను ఎవరికి వారు... వారికి అనుకూలంగా మల్చుకుంటూ మీడియాల ద్వారా ప్రజల్లో ఉత్కాంఠాన్ని రేపుతుండడంతోపాటు రాజకీయ ధ్వేషాలు రగులుకోవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మాజీ మంత్రులు బి. శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి(B. Sriramulu, Gali Janardhan Reddy) మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులపై మరో ఆరోపణలకు దిగారు.
కాల్పుల ఘటనలో మృతి చెందిన రాజశేఖర్ అంత్యసంస్కారాలపై అనుమానాలు ఉన్నాయన్లి మాజీ మంత్రి శ్రీరాములు అన్నారు. సాధారణంగా హిందూ సంప్రదాయల్లో కొంతమంది మాత్రమే మృతదేహాలను కాలుస్తారని, మిగిలిన వారంతా పూడ్చిపెట్టడం సహజమని, అయితే కాల్పుల్లో మృతిచెందిన రాజశేఖర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టకుండా కాల్చడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. రాజశేఖర్ తండ్రి చనిపోయినపుడు పూడ్చి పెట్టారని, కొడుకు చనిపోతే కాల్చేవిధానం పాటించడం వెనక అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తోందన్నారు.

సాక్ష్యాదారాలు నాశనం చేసే ఉద్దేశంతోనే మృతుడి కుటుంబసభ్యులను బెదిరించి మృతదేహాలను కాల్చినట్లు ఆయన ఆరోపించారు. మృతుడి శరీరంలో ఐదు బుల్లెట్లు వెళ్ళినట్లు.. విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు జాగ్రత్త పడినట్లు తెలుస్తోందన్నారు. రెడ్డి సమాజం సాంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాల్చరని, పాతిపెట్టడం వారి సాంప్రదాయమన్నారు. ఘటన తీవ్రతరం అయితే మళ్ళీ పోస్టుమార్టం ఎక్కడ చేస్తారనోనని...కాంగ్రెస్ నాయకులు భయపడి మృతదేహాన్ని కాల్చివేశారని... దీనిపై కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News