Share News

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

ABN , Publish Date - Jan 03 , 2026 | 01:11 PM

కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

- బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర

బెంగళూరు: బళ్లారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి గూండాగిరి చేసి బీజేపీ ఎమ్మెల్యేలను భయపెట్టాలని చూస్తున్నారని, దీన్ని బీజేపీ సహించేది లేదని పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర అన్నారు. బళ్లారిలో గురువారం రాత్రి జరిగిన సంఘటనపై విజయేంద్ర బళ్లారికి వచ్చి జనార్దన్‌రెడ్డిని పలకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి తండ్రి నారా సూర్యనారాయణరెడ్డి ఇంతక ముందు శ్రీరాములను హత్య చేయించేందుకు కుట్రపన్నాడని ఆరోపించారు.


pandu4.2.jpg

వాల్మీకి మహర్షి సముదాయం, అలాగే వాల్మికి విగ్రహం ఏర్పాటుకు గతంలో యడియూరప్పగా సీఎంగా ఉన్న కాలంలోనే అభివృద్ది చేశామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు బీజేపీ నాయకులు లైనా జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు, అనంద్‌సింగ్‌ లాంటి వారిని బయపెట్టి ఇబ్బంది గురి చేయాలని చూస్తున్నారని ఇందుకు బీజేపీ పార్టీ తిప్పకొడుతుందన్నారు. భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డి మనుషులు గాలి జనార్దన్‌రెడ్డిని హత్య చేయాలని చూశారని అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం లో శాంతి భద్రతలు లోపించాయన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు

ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల

Read Latest Telangana News and National News

Updated Date - Jan 03 , 2026 | 01:11 PM