Bengaluru News: పోలీస్‌స్టేషన్‌లోనే తాళి తీసి భర్త మొహంపై కొట్టి..
ABN , Publish Date - Jan 07 , 2026 | 01:28 PM
పోలీస్ స్టేషన్‌లోనే తాళి తీసి భర్త మొహంపై విసిరికొట్టి..తల్లిదండ్రులతో కలసి యువతి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- తల్లిదండ్రులతో వెనుదిరిగిన యువతి
చిక్కబళ్ళాపుర(బెంగళూరు): వారిద్దరూ ప్రేమించుకున్నారు... ఇద్దరూ మేజర్లు కావడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు... ఒక్కరోజులోనే భర్త భాగోతం బయటపడింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తాళి తీసి భర్త మొహంపై కొట్టి తల్లిదండ్రులతో యువతి వెనుతిరిగారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన చిక్కబళ్ళాపుర(Chikkaballapura)లో చోటు చేసుకుంది. చిక్కబళ్ళాపుర నగరం గంగనమిద్దె నివాసి పెయింటర్‌గా పనిచేసే సందీప్ అనే వ్యక్తి కంద వార కాలనీలో నివసించే శ్రీమంత కుటుంబానికి చెందిన 18ఏళ్ల యువతిని ప్రేమ పేరిట నమ్మించారు.
రెండురోజులక్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. జిల్లాలోని చింతామణి పట్టణంలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చిక్కబళ్ళాపురకు వస్తుండగా సోమవారం శిడ్లఘట్ట పట్టణంలో యువతి తల్లిదండ్రులు వీరి కారును అడ్డగించి మహిళా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తొలుత మేం పెళ్లి చేసుకున్నాం... మేం సుఖంగా ఉండేందుకు వదిలిపెట్టాలని కోరారు. అయితే అసలు విషయం ఇటు యువతి తల్లిదండ్రులు, పోలీసులు అప్పటికే ఆరా తీశారు. చిక్కబళ్ళాపుర తాలూకా నాయనహళ్ళికి చెందిన ఓ మైనరును 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రశాంత్‌నగర్‌లో ఓ మహిళకు మోసం చేసిన విషయం బహిరంగమైంది. బెంగళూరు రామమూర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇతడిపై పోక్సో కేసు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయానికే మరో మైనరు బాలిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇతడినుంచి మోసపోయిన విధానాన్ని అందరి సమక్షంలో తెలిపారు. దీంతో ఒక్కసారిగా విసుగు చెంది నేనూ మోసపోయానని అయితే కొంత కాలం ఇతడితో ఉంటే నా జీవితం కూడా నాశనమయ్యేదని యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను కట్టిన తాళిబొట్టును తెంపి అతడి మొఖానికి విసిరికొట్టి తల్లిదండ్రులతో కలసి యువతి వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News