Home » Marriage
చైనాలో పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వం కొత్త మార్గాలను అనుసరిస్తోంది. యువత పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, పార్కులు, దేవాలయాల్లోనూ వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించిన వ్యవహారంలో సోమవారం హైకోర్టులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పథకాల అమలు కోసం జారీ చేసిన 8 ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది.
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.
శ్రావణ మాసం వచ్చేసింది. దానితో పాటు శుభ గడియలూ ప్రారంభమయ్యాయి.
ఈ పెద్దాళ్లున్నారే? మా ప్రేమను ఎప్పుడూ అంగీకరించరు అని యువతలో చాలామంది ఓ అభిప్రాయం ఏర్పరుచుకున్నా.. కొందరు మాత్రం జాతకాల విషయంలో మీ నమ్మకమే మా నమ్మకం అని శ్రుతి కలుపుతున్నారు! కాబోయే జీవిత భాగస్వామి అన్ని విధాలుగా నచ్చినా, ఆ ప్రేమాయణం పెళ్లిపీటలదాకా వెళ్లాలంటే జాతక చక్రం కుదరాల్సిందేనంటున్నారు.
అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా, ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం.
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌మయమైంది. వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అమెరికాలోని విస్కాన్సిన్ స్టేట్‌లో నూతన జంట ఉండగా కర్నూలు నుంచి తల్లిదండ్రులు గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా సాగుతోంది. బంధు మిత్రులు ఎంతో కోలాహలంగా ఉన్నారు. కాసేపట్లో వరమాల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అలాంటి సమయంలో ఆ పెళ్లి వేడుకలో ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది.
వివాహ వేడుకకు తాగి వచ్చిన వరుడికి వధువు తగిన బుద్ధి చెప్పింది. అందరి ఎదుటా ధైర్యంగా నిర్ణయం తీసుకుని ప్రశంసలు అందుకుంది. ఆమె నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ సైతం అభినందించారు.