నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:31 PM
ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.
క్రోసూరు(అమరావతి): ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది. నాలుగు నెలల పాటు వరుస ముహూర్తాలతో వివాహ వేదికలు కళకళ లాడనున్నాయి. మౌడ్యమి రోజుల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే శుభ ప్రథంగా ఉండదని పండితులు చెప్పారు. దీంతో ఆయా దినాల్లో ఆయా కార్యాలు జరగలేదు.
ఈక్రమంలో మే వరకు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూల మైన రోజులు ఉన్నట్లు పండితులు చెపుతున్నారు. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26, 27, 28, 29, మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14, 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లోను ముహూర్తాలు ఉన్నట్లు పండితులు ప్రకటించారు.
మౌడ్యమితోనే ముహుర్తాలు లేవు
మౌడ్యమి కారణంగానే డిసెం బరు నుంచి శుభ ముహుర్తాలు లేవు. ఈ కారణంగా వివాహాలు నిలిచిపోయాయి. ఈ సంవత్సరం ఎక్కువ ముహూర్తాలు ఉన్నందు న వివాహాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
- మేడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి
ఈ వార్తలు కూడా చదవండి:
632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News