Share News

Theft Viral Video: వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

ABN , Publish Date - Dec 28 , 2025 | 08:13 PM

ఓ కళ్యాణ మంటపం అతిథులతో సందడి సందడిగా ఉంది. అయితే సందట్లో సడేమియా అన్నట్లు ఇద్దరు మహిళలు అతిథుల తరహాలో లోపలికి వచ్చారు. పర్సులు, హ్యాండ్‌బ్యాగులతో బుర్ఖాలు ధరించి రావడంతో..

Theft Viral Video: వివాహ వేడుకలోకి అతిథుల్లా వచ్చారు.. అంతా చూస్తుండగానే..

ప్రస్తుతం వివాహ వేడుకలు అంటేనే ఆనందం, జోకులు, ప్రాంక్‌లు, రీల్స్.. తదితరాలతో నిండి ఉంటాయి. అయితే ఇదే వేడుకల మాటున కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా జరుగుతుంటాయి. కొందరు బంధువుల మాదిరే వచ్చి నీట్‌గా లూటీ చేసేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, హైదరాబాద్‌లో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడకకు హాజరైన మహళలు.. చివరకు ఏం చేశారో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral CCTV Video) తెగ వైరల్ అవుతోంది. చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్‌లోని మన్నత్ ఫంక్షన్ హాల్లో వివాహం (marriage) జరుగుతోంది. కళ్యాణ మంటపం అతిథులతో సందడి సందడిగా ఉంది. అయితే సందట్లో సడేమియా అన్నట్లు ఇద్దరు మహిళలు అతిథుల తరహాలో లోపలికి వచ్చారు. పర్సులు, హ్యాండ్‌బ్యాగులతో బుర్ఖాలు ధరించి రావడంతో.. అంతా వారు వధూవరులకు బంధువులేమో అని అనుకున్నారు.


ఆ ఇద్దరు మహిళలు అతిథుల మధ్య సాదాసీదాగా తిరుగుతూ అనుమానం రాకుండా కలిసిపోయారు. ఈ క్రమంలో వారికి దొరికిన బ్యాగులను ఎంతో చాకచక్యంగా చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరికీ బ్యాగులు దొరగ్గానే (Women who stole bags) అక్కడి నుంచి తాపీగా జారుకున్నారు. తర్వాత తమ బ్యాగులు, ఫోన్ల కోసం వెతికిన అతిథులకు చోరీ విషయం తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కళ్యాణ మంటపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో చివరకు ఆ ఇద్దరు మహిళ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ మహిళల తెలివి మామూలుగా లేదుగా’..అంటూ కొందరు, ‘వివాహాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. వార్త రాసే సమయానికి ఈ వీడియో 300కి పైగా లైక్‌లు, 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 28 , 2025 | 08:13 PM