Share News

Jugaad Viral Video: ఆకలి అన్నీ నేర్పిస్తుంది.. పారతో వీళ్లు చేసిన పని చూస్తే..

ABN , Publish Date - Dec 28 , 2025 | 05:11 PM

ఓ ఇంటి నిర్మాణ స్థలంలో కొందరు కార్మికులు రోటీలు చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం పిండి కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే వారి వద్ద వంట పాన్ ఉండదు. అయినా సరే.. ఎలాగైనా రోటీలు చేయాలని ఫిక్స్ అయ్యారు. చివరకు ఎలా చేశారో చూడండి..

Jugaad Viral Video: ఆకలి అన్నీ నేర్పిస్తుంది.. పారతో వీళ్లు చేసిన పని చూస్తే..

వినూత్నంగా ఆలోచించాలే గానీ.. మన చుట్టూ ఉన్న వాటితోనే అద్భుతాలు చేయొచ్చు. కొందరు కళ్ల ముందున్న వస్తువులతో వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. ఐరన్ బాక్స్ లేకున్నా కుక్కర్‌తో చేసేయడం, షవర్ లేకున్నా గ్యాస్ స్టవ్‌తో పని పూర్తి చేయడం వంటి విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి విచిత్రం సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కార్మికులు రోటీలు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్.. వీరి తెలివి మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి నిర్మాణ స్థలంలో కొందరు కార్మికులు రోటీలు చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం పిండి కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే వారి వద్ద వంట పాన్ ఉండదు. అయినా సరే.. ఎలాగైనా రోటీలు చేయాలని ఫిక్స్ అయ్యారు. వారి వద్ద ఉన్న ఇనుప పారను చూడగానే వారికి బల్బ్ వెలిగింది. చివరకు దాంతోనే వంట చేసేందుకు సిద్ధమయ్యారు.


ఇటుకలను పొయ్యిలా సిద్ధం చేసి మంట పెట్టారు. దానిపై ఇనుప పారను పెట్టి వేడి చేశారు. దానిపై యథావిధిగా రోటీలను వేసి వేడి చేశారు. ఇలా వంట పాన్ లేకుండా (Workers making rotis on iron shovel) ఇనుప పారతోనే రోటీలు చేసేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కార్మికుల తెలివితేటలకు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషళ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి జుగాద్ భారతదేశంలో మాత్రమే సాధ్యం’.. అంటూ కొందరు, ‘ఎలాంటి సమస్యకైనా భారతీయుల దగ్గర సమాధానం ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.82 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 28 , 2025 | 06:32 PM