Funny Viral: కంపెనీపై రివేంజ్ తీర్చుకున్న ఉద్యోగి.. ఏకంగా టాయిలెట్ పేపర్‌తో..
ABN , Publish Date - Dec 24 , 2025 | 03:11 PM
టాయిలెట్‌లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. తన కంపెనీపై ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తూ అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. కొందరికి తమ బాస్ నుంచి టార్చర్ ఉంటే.. మరికొందరికి కంపెనీ నిబంధనలు, ఇంకొందరికి తోటి సిబ్బందితో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భా్ల్లో కొందరు ఉద్యోగులు చిత్రవిచిత్రంగా తమ నిరసనను వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కంపెనీపై విచిత్రంగా రివేంజ్ తీర్చుకున్నాడు. టాయిలెట్ పేపర్‌తో అతను చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. టాయిలెట్‌లోకి వెళ్లిన వారు.. అక్కడ ఉన్న టిష్యూ పేపర్ చూసి అవాక్కయ్యారు. ఆ పేపర్‌పై ‘కంపెనీ నాతో వ్యవహరించిన తీరుకు నిదర్శనంగా నేను నా రాజీనామా కోసం ఈ పేపర్‌ను ఎంచుకున్నాను’.. అని రాసి ఉంది. టిష్యూ పేపర్‌పై (Toilet paper) ఇలా విచిత్రంగా రాయడం చూసి అంతా అవాక్కవుతున్నారు.
దీన్ని బట్టి చూస్తే సదరు కంపెనీలో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కోపాన్ని ఇలా టిష్యూ పేపర్‌పై రాసి చల్లార్చుకున్నట్లు అర్థమవుతోంది. లేదా కేవలం వైరల్ అయ్యేందుకే ఇలా విచిత్రంగా చేసినట్లు ఉంది. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ పోస్టుపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతడి ప్రతీకారం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘మేము కూడా రాజీనామాను ఇలాగే ఇవ్వాలనుకుంటున్నాం’.. అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 94 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి