Share News

Snake Charming Funny video: పాము ముందు బూర ఊదమంటే.. ఏకంగా ఏడిపించాడుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:35 PM

ఇళ్ల సమీపంలోకి పాము రావడంతో అంతా భయపడ్డారు. దాన్ని బయటికి పంపించేందకు పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించారు. సంకలో సంచి, చేతిలో బూరతో అక్కడికి వచ్చిన అతను.. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Snake Charming Funny video: పాము ముందు బూర ఊదమంటే.. ఏకంగా ఏడిపించాడుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాములు పట్టుకునే సమయంలో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వీటిలో కొన్ని అంతా షాక్ అయ్యేలా ఉంటే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు పాములు పట్టుకునే సమయంలో చేసే పనులు విచిత్రంగా అనిపిస్తుంటాయి. ఇలాంటివి చూసేందుకు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పామును పట్టుకునేందుకు ఓ వ్యక్తిని పిలిపించారు. బూర ఊది పామును బయటికి తీయమంటే.. అతను చేసిన నిర్వాకం చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇళ్ల సమీపంలోకి పాము రావడంతో అంతా భయపడ్డారు. దాన్ని బయటికి పంపించాలని చూడగా.. మురుగు కాలువలోకి దూరింది. దీంతో ఆ పామును బయటికి తీసేందుకు చివరకు పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించారు. సంకలో సంచి, చేతిలో బూరతో అక్కడికి వచ్చిన అతను.. పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. కాలువలో నుంచి పామును బయటికి తీసేందుకు బూర తీసుకుని ఊదడం స్టార్ట్ చేశాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా నవ్వుకునే ఘటన చోటు చేసుకుంది.


అతను బూరను అందరిలా కాకుండా.. కుయ్ కుయ్ అంటూ శాడ్ మ్యూజిక్ తరహాలో ఊదాడు. ఈ సౌండ్ .. పాము బూర సౌండ్‌కు (Snake Charming) పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో ఆ సౌండ్ వినగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఈ సౌండ్ వింటే పాము బయటికి రావడం పక్కన పెడితే.. అటు నుంచి అటే పారిపోతుంది.. అంటూ అక్కడున్న వ్యక్తి నవ్వుతూ చెప్పాడు. దీంతో పాములు పట్టుకునే అతను.. బూరకు ఉన్న స్టిక్స్‌ను బయటికి తీసి మళ్లీ ట్రై చేశాడు. కానీ సౌండ్‌లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు.


ఇలా ఆ వ్యక్తి బూరను విచిత్రంగా ఊది.. అందరినీ తెగ నవ్వించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతను పాములను కాదు.. కప్పలను పట్టుకోవడానికి వచ్చినట్లున్నాడు’.. అంటూ కొందరు, ‘పాము కూడా సిగ్గుపడేలా ఉందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..

పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 04:35 PM