Woman Theft Funny Video: హోటల్ గది ఖాళీ చేసే సమయంలో.. ఈమె చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Dec 06 , 2025 | 02:57 PM
హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్యకు వింత ఆలోచన వచ్చింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో కక్కుర్తి కనిపిస్తుంటుంది. అయితే కొందరిలో మాత్రం ఇది పీక్స్‌లో ఉంటుంది. ఎంతలా ఉంటుందంటే.. కంటికి కనిపించే ప్రతీదీ తనకే దక్కాలి.. అనేంతలా ఉంటుంది. ఇలాంటి కక్కుర్తితో కొందరు చేసే పనులు.. అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. మరికొందరు చేసే పనులు తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ హోటల్ గదిలో చేసిన నిర్వాకం చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హోటల్ గదిలో ఇదేం పనమ్మా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. హోటల్ గదిని బుక్ చేసుకున్న దంపతులు.. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఇక్కడే అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. భర్త హోటల్ గదిని ఖాళీ చేస్తున్న సమయంలో భార్య కన్ను.. లోపల ఉన్న వస్తువులపై పడింది. ఫ్రీగా ఏం దొరుకుతుందబ్బా.. అని గది మొత్తం తేరిపారా చూసింది.
ఇంతలో ఆమెకు బాత్రూంలో హ్యాండ్ వాష్ లిక్విడ్ కనిపించింది. దాన్ని ఎందుకు వదిలేయడం అనుకుని.. వెంటనే అక్కడికి వెళ్లి.. లోపల ఉన్న లిక్విడ్ బాటిల్‌ను బయటికి తీసింది. అందులోని లిక్విడ్‌ను (Woman Stole Hand Wash Liquid) వాటర్ బాటిల్‌లో నింపేసింది. తర్వాత ఖాళీ బాటిల్‌ను యథావిధిగా అక్కడే పెట్టేసి.. ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయింది. లిక్విడ్‌ను కూడా వదలని ఆమె కక్కుర్తి.. అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది.
ఈ ఘటనను మొత్తం ఆమె భర్త వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె కక్కుర్తి మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ఘనకార్యాలు మహిళలకే సాధ్యం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.19 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి