Watch Viral Video: ఇందుకే చెప్పేది.. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు అని..
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:47 PM
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ వ్యక్తి బైకర్ వద్దకు వెళ్లి అతడిపై సడన్‌గా దాడికి దిగాడు. అతడి మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆ బైకర్ ఎలాగోలా అతని నుంచి విడిపించుకున్నాడు. ఆ తర్వాత బైకు నుంచి కిందకు దిగాడు. ఈ క్రమంలో..
చూసేందుకు బలహీనంగా కనిపించినా, అమాయకంగా కనిపించినా.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చాలా మంది చూస్తుంటారు. వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి శునకానందం పొందుతుంటారు. అయితే అన్నిసార్లూ పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. అమాయకులు అనుకున్న వారు కాస్త తిరగబడి ఎదురుదాటి చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకర్‌పై దాడి చేయాలని చూశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ వ్యక్తి బైకర్ వద్దకు వెళ్లి అతడిపై (Man Attacked The Biker) సడన్‌గా దాడికి దిగాడు. అతడి మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఆ బైకర్ ఎలాగోలా అతని నుంచి విడిపించుకున్నాడు. ఆ తర్వాత బైకు నుంచి కిందకు దిగాడు. ఈ క్రమంలో బైకు కూడా కిందపడిపోయింది.
అయితే ఆ తర్వాత బైకర్.. అక్కడి నుంచి పారిపోతాడని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా అతడి దగ్గరికి వెళ్లి.. మెడపై ఒక గుద్దు గుద్దాడు. దెబ్బకు ఆ వ్యక్తి ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడిపోయాడు. ఆ తర్వాత ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయాడు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏదో చేయాలని వెళ్తి.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడుగా’.. అంటూ కొందరు, ‘ఇతడి పంచ్ పవర్ మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 97 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..
పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి