Share News

Fish Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. చేపను పట్టుకుని మరీ..

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:06 PM

ఓ వ్యక్తి చెరువు గట్టుపై చేసిన వింత నిర్వాకం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. చేతిలో సాస్ బాటిల్‌ను పట్టుకున్న అతను.. చేపను పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాడేమో అని అంతా అనుకుంటారు. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Fish Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. చేపను పట్టుకుని మరీ..

కొందరు తమ సరదా కోసం అవతలి వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. మూగజీవాలు, పిల్లలు, వృద్ధులను ఇబ్బంది పెడుతూ కొందరు తమ సరదా తీర్చుకుంటుంటారు. అంతటితో ఆగకుండా వాటిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాసిక ఆనందాన్ని పొందుతుంటారు. ఇలాంటి వీడియోలను నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేపను పట్టుకుని చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది జీవ హింస కిందకు వస్తుందని, ఇలాంటి వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెరువు గట్టుపై చేసిన వింత నిర్వాకం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. చేతిలో సాస్ బాటిల్‌ను పట్టుకున్న అతను.. చేపను పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాడేమో అని అంతా అనుకుంటారు.


అయితే అతను చేపను పట్టుకుని.. దాని నోరు తెరచి, (Man poured sauce into fish's mouth) అందులో సాస్ పోశాడు. ఆ తర్వాత చేపను యథావిధిగా నీటిలోకి వదిలేశాడు. ఇలా చేప నోట్లో సాస్ పోసిన ఇతన్ని చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది జీవ హింస కిందకు వస్తుందని, ఇలాంటి వారిని తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా చేయడం చాలా తప్పు.. ఇలాంటి వారిని వదిలేయొద్దు’.. అంటూ కొందరు, ‘ఇది అసహ్యకరమైన చర్య.. ఇలాంటి వారిని శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌ చేయగా.. 17 వేల మందికి పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2025 | 06:06 PM