Jugad Viral Video: పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే..
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:23 PM
సాధారణంగా ఎవరైనా.. బ్రష్ పాతపడగానే పక్కన పడేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు వాటిని వినూత్నంగా మార్చడం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి పాత బ్రష్‌ను వింతగా మార్చేశాడు. ఇతని ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు..
వాడిపడేసిన వస్తువులను కొందరు సరికొత్తగా మార్చేస్తుంటారు. కొందరు పేస్ట్ ట్యూబ్‌ను కొళాయి మూతగా మారిస్తే.. మరికొందరు పడేసిన ప్లాస్టిక్ బాటిల్‌ను చీపురు హ్యాండిల్‌గా మార్చేస్తుంటారు. ఇంకొందరేమో.. ఏకంగా పాత చెప్పును ఫోన్ స్టాండ్‌గా ఛేంజ్ చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా, ఓ వ్యక్తి చేసిన వినూత్న ప్రయోగం వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పక్కన పడేసిన పాత బ్రష్‌ను ఓ వ్యక్తి మార్చిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్..! పాత బ్రష్‌ను ఇంతకంటే బాగా ఎవరూ వాడలేరేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా.. బ్రష్ పాతబడగానే (Old brush) పక్కన పడేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు వాటిని వినూత్నంగా మార్చడం చూస్తుంటాం. తాజాగా, ఓ వ్యక్తి పాత బ్రష్‌ను వింతగా మార్చేశాడు. ఇందుకోసం అతను ముందుగా.. బ్రష్‌కు ఉన్న ముళ్లను మొత్తం కాల్చేశాడు.
ఆ తర్వాత స్పాంజ్‌ను తీసుకుని దాని మధ్యలో బ్రష్ పట్టేలా రంధ్రం చేశాడు. చివరగా బ్రష్ చివరలో గమ్ అంటించి, దాన్ని స్పాంజ్ మధ్యలో పెట్టాడు. చివరకు దంతాలను క్లీన్ చేసే బ్రష్ కాస్తా.. (Bottle cleaning) బాటిళ్లను శుభ్రం చేసే క్లీనర్‌లా మారిపోయింది. ఆ బ్రష్‌తో బాటిల్‌ను ఎంతో సులభంగా శుభ్రం చేయడానికి వీలుగా ఉంది. దీంతో ఈ ప్రయోగం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ ప్రయోగం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘పాత బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడి చేసిన పనేంటో చూడండి..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి