Ward Member Election Campaign: ఐదేళ్ల పాటు కటింగ్ ఫ్రీగా చేస్తా.. అభ్యర్థి భర్త వినూత్న ప్రచారం..
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:36 PM
నా భార్యని వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే మగవారందరికీ కంటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానని ఓ భర్త వినూత్న ప్రచారం చేస్తున్నాడు. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఓట్ల పండగ జరుగుతోందని చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని అన్ని పంచాయతీ, గ్రామ, వార్డు పరిధిలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. ప్రధాన పార్టీలు బలపరచిన సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. డబ్బు పంచడం ఓ ఎత్తు అయితే.. కొందరు చీరలు, వివిధ రకాల వస్తువులను బహుమతిగా అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వార్డ్ మెంబర్ ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే.. ఐదేళ్ల పాటు ఫ్రీగా కటింగ్ చేస్తానని భర్త ప్రకటించడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్ల కొడుతోంది..
నా భార్యని వార్డ్ మెంబర్‌గా గెలిపిస్తే మగవారందరికీ కంటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానని ఓ భర్త వినూత్న ప్రచారం చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా (Siddipet District) దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో ఓ మహిళ వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తోంది. ప్రస్తుతం అన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘోత్తంపల్లిలో వార్డ్ మెంబర్‌గా పోటీ చేస్తున్న మహిళ కూడా ప్రచారం మొదలెట్టింది.
సదరు మహిళ భర్త క్షురకుడు కావడంతో ప్రచారం వినూత్నంగా మొదలెట్టాడు. తన భార్యను వార్డ్ మెంబర్‌గా (Ward member) గెలిపిస్తే.. వార్డులోని మగవారందరికీ ఐదేళ్ల పాటు కటింగ్ (Free cutting) , షేవింగ్.. ఫ్రీగా చేస్తానని చెబుతున్నాడు. ఇంటింటికీ వెళ్లి ఈ ఆఫర్ చెబుతూ.. తన భార్యను గెలిపించాలని కోరుతున్నాడు.
ఇతడి వింత ఆఫర్ వినేందుకు వినూత్నంగా ఉండడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇతడి ఆఫర్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
పెళ్లి వేదికపై డబ్బు వెదజల్లిన మహిళ.. వరుడి చేసిన పనేంటో చూడండి..
వీళ్లకు ఎక్కడా స్థలం లేనట్లుంది.. రన్నింగ్ రైల్లో ఏకంగా డోరు వద్దే నిలబడి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి