Teacher Student Funny Video: ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 05 , 2025 | 08:19 PM
విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటుంటారు. ఈ క్రమంలో టీచర్ ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి.. ఆపరేషన్ చేసే ముందు రోగికి అనస్థీషియా ఎందుకు చేస్తారు.. అని అడిగాడు. దీనికి విద్యార్థి సమాధానం విని అంతా తెగ నవ్వుకుంటున్నారు..
టీచర్, విద్యార్థులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. టీచర్ అడిగే ప్రశ్నలకు విద్యార్థులు వింత వింత సమాధానాలు చెబుతుంటారు. కొందరు విద్యార్థులు టీచర్ అడిగే ప్రశ్నలకు ఎంతో లాజిక్‌గా సమాధానాలు చెబుతుంటారు. అలాంటి సమాధానాలు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకు చేస్తారు.. అని టీచర్ అడిగిన ప్రశ్నకు విద్యార్థి ఏం సమాధానం ఇచ్చాడో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. విద్యార్థులంతా క్లాస్ రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటుంటారు. ఈ క్రమంలో టీచర్ ఓ విద్యార్థి దగ్గరికి వెళ్లి.. ఆపరేషన్ చేసే ముందు రోగికి అనస్థీషియా (Anesthesia) ఎందుకు చేస్తారు.. అని అడిగాడు.
టీచర్ అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి ఏమాత్రం తముముకోకుండా ఠక్కున సమాధానం ఇచ్చాడు. ‘అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ ఎందుకు చేస్తారంటే.. ఆపరేషన్ చేయడం రోగి నేర్చుకోకుండా ఉండేందుకు’.. అని వెంటనే సమాధానం ఇచ్చాడు. ఈ విద్యార్థి సమాధానం విని అంతా తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ విద్యార్థి తెలివితేటలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఇది కదా అసలు సిసలు సమాధానం’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 2.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..
పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి