Bike Stunt Viral Video: ప్రాణాలతో సయ్యాట అంటే ఇదే.. ఈ యువకుల స్టంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 05 , 2025 | 04:54 PM
కొందరు యువకులు బైకులతో రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి రాగానే వారికి ఒక్కసారిగా పూనకం వచ్చింది. చాలా మంది బైకును గాల్లోకి లేపడం, వెనుక చక్రాలను పైకి లేపడం, వేగంగా వెళ్తున్న బైకు వెనుక వేలాడడం వంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం చూస్తుంటాం. అయితే ..
బైకుపై కూర్చోగానే చాలా మంది యువకులకు పూనకాలు వస్తుంటాయి. పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని కొందరు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇంకొందరు ఏవోవే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఇంకొందరైతే.. ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి డేంజరస్ స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు యువకులు చేస్తున్న బైక్ రైడింగ్ చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు బైకులతో రోడ్డు పైకి వచ్చారు. రోడ్డు పైకి రాగానే వారికి ఒక్కసారిగా పూనకం వచ్చింది. చాలా మంది బైకును గాల్లోకి లేపడం, వెనుక చక్రాలను పైకి లేపడం, వేగంగా వెళ్తున్న బైకు వెనుక వేలాడడం వంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం చూస్తుంటాం.
అయితే వీరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా స్కూటీని బైకుపై పెట్టి రైడ్ చేశారు. ఓ వ్యక్తి బైక్ డ్రైవ్ చేస్తుండగా.. (youth put scooty on running bike) మరో యువకుడు వెనుక స్కూటీని పట్టుకుని నిలబడ్డాడు. ఏమాత్రం అటూ, ఇటూ అయినా ఇద్దరూ కిందపడడమే కాకుండా పక్కన వెళ్లే వాహనదారులకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అయినా వారిలో ఏమాత్రం భయం కనిపించలేదు. వారి వెనుకే ముగ్గురు యువకులు మరో బైకులో ప్రమాదకరంగా వెళ్లున్నారు.
ఇంకో బైకులో వెళ్తున్న వారు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వీరు చావడమే కాకుండా.. ఎదుటి వారిని కూడా చంపేస్తారు’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..
పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి