Share News

Indigo Flights Issue: నా కూతురికి రక్తస్రావం అవుతోంది.. విమానాశ్రయంలో ఓ తండ్రి ఆవేదన..

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:06 PM

దేశ వ్యాప్తంగా శుక్రవారం సుమారు 400 విమాన సర్వీసులను.. ఇండిగో రద్దు చేసింది. దీంతో ప్రయాణికులంతా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇదిలావుంటే.. చాలా మంది తమ పనులు ఆగిపోయి అవస్థలు పడుతున్నారు. మరికొందరేమో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రయాణికులు కోపం కట్టలు తెంచుకుంటోంది..

Indigo Flights Issue: నా కూతురికి రక్తస్రావం అవుతోంది.. విమానాశ్రయంలో ఓ తండ్రి ఆవేదన..

ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల పరిస్థితి గందరగోళంగా మారింది. కొందరు ముఖ్యమైన పనులు ఆగిపోయి ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులంతా తమ తమ సమస్యలను వివరిస్తూ.. సమాధానం చెప్పాలని ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. దీంతో విమానాశ్రయాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ తండ్రి తన కూతురికి రక్తస్రావం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మరో వ్యక్తి నా ఉద్యోగం పోకుండా మా బాస్‌కు సందేశం పంపించండి.. అంటూ వేడుకున్నాడు. ఇలా ప్రయాణికులు వారి వారి సమస్యలను విన్నవించుకుంటున్నారు..


దేశ వ్యాప్తంగా శుక్రవారం సుమారు 400 విమాన సర్వీసులను.. ఇండిగో (IndiGo flight cancellations) రద్దు చేసింది. దీంతో ప్రయాణికులంతా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ఇదిలావుంటే.. చాలా మంది తమ పనులు ఆగిపోయి అవస్థలు పడుతున్నారు. మరికొందరేమో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రయాణికులు కోపం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడికక్కడ ఇండిగో సిబ్బందిని నిలదీస్తున్నారు. ఓ వ్యక్తి తన కూతురుకు రక్తస్రావం అవుతోందని వాపోయాడు. దయచేసి శానిటరీ పాడ్లు తెప్పించండి.. అంటూ సిబ్బందిని వేడుకున్నాడు. మరోవైపు ఇంకో వ్యక్తి తన ఆఫీసుకు సరైన సమానికి చేరుకోకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తన ఉద్యోగం పోతుందేమో అని బాధపడ్డాడు. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి, ‘నా ఉద్యోగం పోకుండా బాస్‌కు సమాచారం అందించండి’.. అంటూ వేడుకున్నాడు. అలాగే మరో ప్రయాణికుడు ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ఇంకోసారి బుద్ధి ఉంటే ఈ విమానం ఎక్కను’.. అంటూ తన అసహనాన్ని బయటపెట్టాడు. ఇలా విమానాశ్రయాల్లో ఎక్కడ చూసినా ప్రయాణికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


విమానాల రద్దుకు కారణమిదే..

దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో ఇండిగోకు చెందిన 1,000కు పైగా విమానాలు రద్దు అయినట్లు తెలిసింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందలాది విమానాల రాకపోకలు ఆగిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 48 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 600కు పైగా విమానాలు రద్దయ్యాయి. 20 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలే ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. 2024 జనవరిలో ఈ నియమాలను ప్రకటించినా.. ఇప్పటివరకూ వాటిని అమలు చేయలేదు.


కొత్త నిబంధనలు ఇవే..

  • సిబ్బందికి ప్రతి వారం తప్పనిసరి విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.

  • రాత్రిపూట విధులు మరింత పెంపు (00:00–06:00)

  • ఒక్కో పైలట్‌కు వారానికి కేవలం రెండు రాత్రి ల్యాండింగ్‌లు మాత్రమే అనుమతి.

  • రాత్రి వేళల్లో గరిష్టంగా 8 గంటల ఫ్లైయింగ్ సమయం మాత్రమే.


ఇండిగో సంస్థ అక్టోబర్ 26న శీతాకాల షెడ్యూల్‌లో విమానాల సంఖ్యను పెంచింది. అయితే సరిగ్గా అదే సమయంలో కొత్త నియమాలు అమల్లోకి రావడంతో పైలట్లు పెద్ద సంఖ్యలో తప్పనిసరి విశ్రాంతికి వెళ్లాల్సి వచ్చింది. ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా వారాంతంలో విమానాలు ఆలస్యమయ్యాయి. ఇంతలో కొత్త విశ్రాంతి నియమాలు అమల్లోకి రావడంతో ఈ ఆలస్యాలు ఒక్కసారిగా ఒకదాని తర్వాత మరొకటి రద్దులకు దారితీశాయి. దీనిపై పైలట్లు ఇండిగో సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు. కొత్త నియమాలు అమల్లోకి వస్తాయని తెలిసినా.. సంస్థ సిబ్బంది నియామకాన్ని నిలిపివేసిందని ఆరోపిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి సంస్థ.. చాలా కాలంగా అతి తక్కువ సిబ్బందితో నడిపిస్తోందని ఆరోపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..

పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 04:22 PM