Woman Snake Viral Video: పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
ABN , Publish Date - Dec 05 , 2025 | 09:25 PM
ఓ ఇంట్లోకి పాము రావడంతో అంతా భయపడి పారిపోయారు. స్థానికులు చివరికి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మహిళ.. పామును పట్టుకునేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో చూడండి..
పామును పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది మహిళలు కూడా ఇటీవల పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఎంతో చాకచక్యంగా పామును పట్టుకుంది. అయితే చివరికి అది చేసిన పనికి ఆమె షాక్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లోకి పాము రావడంతో అంతా భయపడి పారిపోయారు. స్థానికులు చివరికి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మహిళ.. పామును పట్టుకునేందుకు ప్రయత్నించింది. పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్న మహిళ.. దాన్ని బయటికి తీసుకొచ్చి, సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించింది.
అయితే తీరా సంచిలో వేసే సమయంలో పాము సడన్‌గా (Woman Caught The Snake) ఆమె ముఖంపై కాటేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. పాము చాలా సేపు ఆమె దవడును పట్టుకుని గట్టిగా కొరికేసింది. చివరికి పామును ఎలాగోలా బయటికి లాగి సంచిలో వేసుకుంది. అయితే చూస్తుంటే అది విషం లేని పాములాగా కనిపిస్తోంది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. పాము ఎంత పని చేసింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 4.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇలాంటి భార్య అందరికీ దొరకదు.. భర్త వెనుక కూర్చుని ఏం చేస్తుందో చూడండి..
పాడైన బ్రష్‌ను ఇంతకంటే ఎవరూ బాగా వాడలేరేమో.. ప్రయోగం చూస్తే నోరెళ్లబెడతారు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి