Share News

Bike Stunt Viral Video: బైకు నడుపుతున్నాడా.. గాల్లో తేలుతున్నాడా.. ఈ స్టంట్ చూస్తే కళ్లు తేలేస్తారు..

ABN , Publish Date - Aug 22 , 2025 | 10:18 AM

ఓ వ్యక్తి బైకుపై వినూత్నమైన స్టంట్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. బైకు నడుపుకొంటూ మెయిన్ రోడ్డు పైకి వచ్చిన అతను.. బైకును ఎలా డ్రైవ్ చేశాడో చూసి అంతా అవాక్కవుతున్నారు..

Bike Stunt Viral Video: బైకు నడుపుతున్నాడా.. గాల్లో తేలుతున్నాడా.. ఈ స్టంట్ చూస్తే కళ్లు తేలేస్తారు..

కొందరికి బైకుపై కూర్చోగానే పూనకం వస్తుంటుంది. ఈ క్రమంలో ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా వ్యవహరిస్తుంటారు. అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ కొందరు, నెట్టింట ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇంకొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. కొందరు చేసే విన్యాసాలు చూస్తూ ఆశ్చర్యంతో పాటూ అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బైకర్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. చావుకు ఎదురెళ్లడమంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బైకుపై వినూత్నమైన స్టంట్స్ (Innovative stunts on bike) చేసి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. బైకు నడుపుకొంటూ మెయిన్ రోడ్డు పైకి వచ్చిన అతను.. అందరిలా డ్రైవ్ చేయకుండా ప్రమాదకర విన్యాసం చేశాడు.


బైక్ రన్నింగ్‌లో ఉన్న సమయంలో సీటు వెనక్కు జరిగి.. ఆపై రెండు చేతులను సీటుపై ఉంచి గాల్లో తేలాడు. ఇలా చాలా సేపు గాల్లో ఉంటూనూ బైక్‌ను కంట్రోల్ చేశాడు. ఇలా బైక్ రన్నింగ్‌లో ఉండగానే.. చిత్రవిచిత్రమైన స్టంట్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘బైక్ డ్రైవ్ చేస్తున్నాడా.. గాల్లో తేలుతున్నాడా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ ప్రయత్నించకండి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 84 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..

ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 22 , 2025 | 10:18 AM