Innovative Hotel Video: ఆర్డర్ చేయడమే ఆలస్యం.. ఎలా ఎగురుకుంటూ వచ్చిందో చూడండి..
ABN , Publish Date - Aug 22 , 2025 | 09:09 AM
ఓ రెస్టారెంట్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణమేంటంటే.. మిగతా హోటల్స్‌లా కాకుండా ఇందులో విచిత్రమైన ఏర్పాట్లు చేశారు. భోజనం ఆర్డర్ చేయగానే సప్లయర్ తీసుకొచ్చే విధానం చూసి అంతా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు..
వినూత్నమైన హోటళ్లను చాలా చూస్తుంటాం. కస్టమర్లను ఆకట్టుకునే పనిలో భాగంగా హోటళ్ల నిర్వాహకులు చిత్రవిచిత్రంగా ఆలోచిస్తుంటారు. కొందరు వివిధ రకాల ఆఫర్లు పెడితే.. మరికొందరు జైలు, విమానం, ఆకాశంలో భోజనం చేసేలా వింత అనుభూతిని కలిగిస్తుంటారు. ఇలాంటి వింత వింత హోటళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. హోటల్లో ఆర్డర్ చేయడగానే భోజనం వచ్చిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. భోజనం పక్షిలా ఎగురుకుంటూ వచ్చిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బ్యాంకాక్‌లోని (Bangkok) ఓ రెస్టారెంట్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణమేంటంటే.. మిగతా హోటల్స్‌లా కాకుండా ఇందులో విచిత్రమైన ఏర్పాట్లు చేశారు. భోజనం ఆర్డర్ చేయడమే ఆలస్యం.. అలా ఎగురుకుంటూ వచ్చేస్తుందన్నమాట.
ఇందుకోసం ఆ హోటల్లో జిప్‌లైన్ (Zipline) కూడా ఏర్పాటు చేశారు. వినూత్నమైన దస్తులు వేసుకున్న సప్లయర్.. భోజనం ప్లేటు పట్టుకుని ఆ జిప్‌లైన్ సాయంతో గాల్లో ఎగురుకుంటూ (Supplier serving flying on zipline) టేబుల్స్ వద్దకు వచ్చేశాడు. ఆహారం ఆర్డర్ చేసిన వారందరికీ ఇలా గాల్లో ఎగురుకుంటూ వచ్చి వడ్డిస్తున్నాడు. ఇది చూడ్డానికి కొత్తగా అనిపిస్తుండడంతో భోజన ప్రియులు ఈ హోటల్‌కు క్యూ కడుతున్నారు.
ఈ హోటల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇతను సప్లయర్‌లా లేడు.. సూపర్‌మ్యాన్‌లా ఉన్నాడు’.. అంటూ కొందరు, ‘అద్భుతమైన ఐడియా.. ఇలాంటి హోటల్‌ని ఎక్కడా చూడలేదు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 5.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి