Funny Car Viral Video: భార్య అంటే ప్రేమా.. భయమా.. కారు వెనుక ఏం రాశాడో చూస్తే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:22 AM
రోడ్డుపై ఓ కారు వెనుక రాసిన సందేశం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. మందుగా వారికి ఎలాంటి సందేశం కనిపించలేదు. తీరా దగ్గరికి వెళ్లి చూడగా ఫన్నీ సీన్ కనిపించింది..
చెడపకురా చెడేవు.. అలా చూడకురా అప్పు చేసి కొన్నా.. నన్ను చూసి ఏడవకురా.. ఇలాంటి వింత కొటేషన్లను నిత్యం ఆటోలు, కార్లు లారీల వెనుక చూస్తుంటాం. ఇలాంటి వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. వాహనాల వెనుక వినూత్నమైన సందేశాలు రాసే వారిని కూడా చూస్తుంటాం. కొన్ని సందేశాలను చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని సందేశాలు చూసినప్పుడు తెగ నవ్వు వస్తుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కారు వెనుక రాసిన సందేశం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘భార్యంటే ఈమాత్రం భయం ఉండాలి’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై ఓ కారు వెనుక రాసిన సందేశం (Funny message behind the car) చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. మందుగా వారికి ఎలాంటి సందేశం కనిపించలేదు. తీరా దగ్గరికి వెళ్లి చూడగా, కారు వెనుక ‘ఇది నా భార్య కారు’.. అని రాసి ఉంది.
ఈ సందేశం చూసి అంతా అవాక్కవుతున్నారు. దీన్ని చూసి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు. ఆ కారు అతడి భార్య గిఫ్ట్‌గా ఇచ్చిందేమో అని కొందరు, భార్య అంటే ఎంత భయమో.. అంటూ రకరకాలుగా చర్చింకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి’.. అంటూ కొందరు, ‘అలా రాయకపోతే చంపేస్తుందని భయపడ్డాడేమో’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 2.78 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి సరదారా నాయనా.. స్తంభం పైకి ఎక్కి మరీ..
చిరుత ఎంత చురుకైనదో చూశారా.. చెట్టు పైనుంచి మాంసం పడిపోగానే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి