Driving Viral Video: వీడి టాలెంట్ తగలెయ్య.. కారును ఎలా నడుతున్నాడో చూస్తే.. ఖంగుతింటారు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 08:16 PM
ఓ వ్యక్తి కారు నడుపుతున్నాడు. కారు నడపడంలో వింతేముందీ.. అనేగా మీ సందేహం. ఆగండి.. ఆగండి.. అతను కారు నడపడం కరెక్టే గానీ.. నడిపే సమయంలో చేస్తున్న నిర్వాకం చూస్తే షాక్ అవుతారు.
వాహనాలు నడిపే సమయంలో కొందరు చేసే విన్యాసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. బైకుపై వింత వింత ప్రయోగాలు చేస్తూ కొందరు, కదులుతున్న ఆటోపై కూర్చుని మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేయడం చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి కారు నడపడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. డ్రంకెన్ డ్రైవ్ కాదు.. అంతకు మించి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారు నడుపుతున్నాడు. కారు నడపడంలో వింతేముందీ.. అనేగా మీ సందేహం. ఆగండి.. ఆగండి.. అతను కారు నడపడం కరెక్టే గానీ.. నడిపే సమయంలో చేస్తున్న నిర్వాకం చూస్తే షాక్ అవుతారు. కారు నడుపుతూ (Car Driving) చేసే విన్యాసాలు చాలా చూసి ఉంటారు.. కానీ ఇతను విచిత్రంగా కారు నడిపి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు.
చాలా మంది మందు తాగి డ్రైవ్ చేయడం చూస్తుంటాం. కానీ ఇతను మాత్రం మందు గ్లాసును (glass of alcohol on head) నెత్తి మీద పెట్టుకుని కారు నడుపుతున్నాడు. ఏమాత్రం తల అటూ, ఇటూ కదిపినా గ్లాసు కిందపడుతుంది. కానీ ఇతను కారు నడుపుతూనే గ్లాసును ఎంతో చాకచక్యంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఇతను చేసిన విన్యాసంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మందు తాగి డ్రైవ్ చేయడమే నేరమైతే.. ఇతను ఏకంగా మందు గ్లాసును నెత్తి మీద పెట్టి మరీ నిర్లక్ష్యంగా వాహనం నడపడం చూపరులకు కోపం తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి