Jungle Safari Viral Video: జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులు.. మధ్యలో పారిపోయిన డ్రైవర్.. చివరకు..
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:25 PM
మొత్తం 20 మంది పర్యాటకుల బృందంతో కూడిన వాహనం అడవిలోకి వెళ్లింది. అయితే అడవి మధ్యలో ఉండగా వాహనం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ వాళ్లను వదిలేసి పారిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
జంగిల్ సఫారీ అంటేనే ఓ వింత అనుభూతి అని చెప్పొచ్చు. గాండ్రించే పులులు, దూకుడుగా వేటాడే సింహాలు, ఘీంకరించే ఏనుగులు, చంగుచంగున ఎగిరే జింకలు.. ఇలా అన్ని జంతువులను దగ్గరగా చూడడంతో పాటూ అడవిలోని అందాలను అనుభూతి చెందే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు కూడా ఎదురవుతుంటాయి. క్రూర మృగాలు పర్యాటకుల వాహనాలను చుట్టుముట్టడం, కొన్నిసార్లు వాహనం పైకి ఎగరగడం వంటి ఘటనలు చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అడవి మధ్యలో ఉండగా.. పర్యాటకుల వాహనాన్ని వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో (Rajasthan Ranthambore National Park) ఈ ఘటన చోటు చేసుకుంది. దేశంలో ఈ నేషనల్ పార్క్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జంగిల్ సఫారీ (Jungle Safari ) చేస్తుంటారు. అయితే ఇటీవల ఈ అడవిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మొత్తం 20 మంది పర్యాటకుల బృందంతో కూడిన వాహనం అడవిలోకి వెళ్లింది. అయితే అడవి మధ్యలో (Tourist vehicle stopped in middle of forest) ఉండగా వాహనం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో వాహన డ్రైవర్‌కు పర్యాటకులకు మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత మరో వాహనాన్ని తీసుకొస్తా అని చెప్పి డ్రైవర్ వెళ్లిపోయాడు. వెళ్లిన వాడు మళ్లీ తిరిగి రాలేదు. దీంతో ఆ పర్యాటకులు రాత్రంతా వాహనంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వారిలో కొందరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ అడవిలో 60 కంటే ఎక్కువ పులులు ఉన్నాయి. ఎక్కడ ఏ పులి వచ్చి దాడి చేస్తుందో అన్న భయంతో వారంతా.. రాత్రంతా ఫోన్ లైట్ వెలుతురులో భయంగా భయంగా గడపాల్సి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో రణతంభోర్ పార్క్ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అంతవరకూ లోపలికి వెళ్లకుండా ముగ్గురు డ్రైవర్లపై నిషేధం విధించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ డ్రైవర్ మరీ విచిత్రంగా ఉన్నాడుగా’.. అంటూ కొందరు, ‘వారి పరిస్థితి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి