Train Accident Video: రైలు ఎక్కి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే.. ఇతడికేమైందో చూస్తే..
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:28 PM
రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు..
రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కంగారుగా రైలు ఎక్కే సమయంలో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన ముంబై (Mumbai) ఘట్కోపర్ రైల్వే స్టేషన్‌లో చాలా క్రితం చోటు చేసుకుంది. అయితే ఆ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రన్నింగ్ రైలు ఎక్కే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
రైలు ఆగకముందే ఆ వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించడంతో ప్రమాదవశాత్తు కాలు జారి.. రైలుకు, ఫ్లాట్‌ఫామ్‌కు (Man stuck between train and platform) మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో చివరకు రైలును ఆపేశారు. ప్రయాణికులంతా అక్కడ గుమికూడారు. అతను కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసు సిబ్బంది అతి కష్టం మీద అతన్ని బయటికి తీశారు. అయితే ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రైలు ఎక్కి, దిగే సమయంలో జాగ్రత్తగా ఉండమనేది ఇందుకే’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2 వేల మందికి పైగా లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి