Share News

Elephant Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. ఏనుగుతో మసాజ్.. ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - Aug 15 , 2025 | 03:34 PM

మనుషులను అనుకరించే ఏనుగులను నిత్యం చూస్తుంటాం. కొన్ని ఏనుగులు మనుషుల్లాగా డాన్స్ చేస్తే.. మరికొన్ని ఏనుగులు మనుషులకు వివిధ రకాలుగా సాయం చేస్తుంటాయి. అయితే తాజాగా..

Elephant Viral Video: ఇదెక్కడి సరదారా నాయనా.. ఏనుగుతో మసాజ్.. ఏం చేసిందో చూస్తే..

ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. కొన్నిసార్లు బీభత్సం సృష్టించే ఏనుగులు.. మరికొన్నిసార్లు ఎంతో శాంతంగా, ఇంకొన్నిసార్లు మరెంతో సరదాగా కనిపిస్తుంటాయి. కొన్ని ఏనుగుల ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. యువతికి మసాజ్ చేస్తున్న ఏనుగును చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘ఏనుగుకు ఈ కళ కూడా ఉందా’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మనుషులను అనుకరించే ఏనుగులను నిత్యం చూస్తుంటాం. కొన్ని ఏనుగులు మనుషుల్లాగా డాన్స్ చేస్తే.. మరికొన్ని ఏనుగులు మనుషులకు వివిధ రకాలుగా సాయం చేస్తుంటాయి. అయితే తాజాగా, ఓ ఏనుగు యువతికి మసాజ్ చేసింది.


యువతి బోర్లా పడుకోగా.. ఏనుగు ట్రైనర్ అక్కడికి వచ్చి ఆమెపై టవల్ వేస్తాడు. ఆ తర్వాత ఏనుగు తన ముందు కాలిని ఆమెపై (Elephant massaging young woman) ఉంచి సన్నితంగా మసాజ్ చేస్తుంది. ఏనుగు చేసిన మసాజ్ చూసి ఆ యువతితో పాటూ అక్కడున్న వారంతా అవాక్కవుతున్నారు. చూస్తుంటే ఈ ఏనుగుకు ట్రైనింగ్ ఇచ్చి, తీసుకొచ్చినట్లుగా అనిపిస్తోంది. అయినా ఈ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగుకు మసాజ్ చేయడం కూడా వచ్చా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 69 వేలకు పైగా లైక్‌లు, 1.9 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 15 , 2025 | 05:41 PM