Share News

Eating Food Viral Video: సహపంక్తి భోజనాల్లో వింత టెక్నాలజీ.. పదే పదే తిరక్కుండా ఎలా సెట్ చేశారంటే..

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:23 PM

సాధారణంగా పెళ్లిలో బఫె భోజనాల పద్ధతిని పాటిస్తుంటారు. అయితే కొందరు ఇప్పటికీ సహపంక్తి భోజనాలనే ఏర్పాటు చేస్తుంటారు. సహపంక్తి భోజనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వరుసగా కూర్చున్న అతిథులకు ఒకదానికి తర్వాత ఒకటిగా..

Eating Food Viral Video: సహపంక్తి భోజనాల్లో వింత టెక్నాలజీ.. పదే పదే తిరక్కుండా ఎలా సెట్ చేశారంటే..

పెళ్లిలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. వధూవరుల ఎంట్రీలో అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం, భోజనాల వద్ద తోసుకోవడం, ఊరేగింపులో వినూత్న విన్యాసాలు చేయడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణమైంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, భోజనాల బంతిలో చేసిన వింత ఏర్పాట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఇక్కడ కూడా టెక్కాలజీ వాడేశారుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా పెళ్లిలో బఫె భోజనాల పద్ధతిని పాటిస్తుంటారు. అయితే కొందరు ఇప్పటికీ సహపంక్తి భోజనాలనే ఏర్పాటు చేస్తుంటారు. సహపంక్తి భోజనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వరుసగా కూర్చున్న అతిథులకు ఒకదానికి తర్వాత ఒకటిగా ఆహార పదార్థాలను వడ్డిస్తారు. వారి వెంటే ఓ వ్యక్తి నీళ్లను కూడా పోస్తూ వెళ్తుంటాడు.


అయితే ఇప్పుడు చూడబోయే వీడియోలో కూడా సహపంక్తి భోజనాలు (sahapankti bhoojanam) ఏర్పాటు చేశారు. అయితే ఈ సహపంక్తి భోజనాల్లో వీరు వింత టెక్నాలజీని వాడేశారు. భోజనం వడ్డించాక పదే పదే నీళ్లు పోయడానికి వెళ్లే పని లేకుండా.. అతిథుల ఎదురుగా నీళ్ల పైపులను సెట్ చేశారు. ఒక్కొక్కరి ఎదురుగా ఒక్కో ట్యాప్‌ని కూడా పెట్టారు. భోజనం చేస్తున్న సమయంలో దాహం వేసిన వారు.. (Pipe with taps) ట్యాప్ కింద గ్లాసు పెట్టి నీళ్లు పట్టుకుంటున్నారు.


ఇలా సహపంక్తి భోజనాలలో వినూత్న ఏర్పాట్లు చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సహపంక్తి భోజనాల్లో టెక్కాలజీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 04:23 PM