Share News

Watch video: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. వెల్డింగ్ చేయమంటే తలనే ఇరికించాడుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:36 PM

కొందరు కార్మికులు ఇంటి బయట ఉన్న ఇనుప రెయిలింగ్‌కు వెల్డింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఇనుప కడ్డీలకు వెల్డింగ్ చేస్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

Watch video: ఇదెక్కడి తెలివిరా అయ్యా.. వెల్డింగ్ చేయమంటే తలనే ఇరికించాడుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

వినోదానికి, వింతలు, విశేషాలకు.. సోషల్ మీడియా అడ్డాగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వింత వింత ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొందరు చేసే పనలు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇనుప కబడ్డీలకు వెల్డింగ్ చేయమని చెబితే.. చివరకు ఆ వ్యక్తి చేసిన పనేంటో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు కార్మికులు ఇంటి బయట ఉన్న ఇనుప రెయిలింగ్‌కు వెల్డింగ్ (Welding) చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఇనుప కడ్డీలకు వెల్డింగ్ చేస్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.


ఇనుప కడ్డీకి వెల్డింగ్ చేసే క్రమంలోనే అసలు సమస్య వచ్చి పడింది. కింద ఉన్న మూడు కడ్డీలను వెల్డింగ్ చేసిన అతను.. నాలుగో కడ్డీని కూడా వెల్డింగ్ చేయబోయాడు. అయితే చేసే ముందు తలను వెలపల పెట్టి.. తర్వాత కడ్డీని వెల్డింగ్ చేశాడు. వెల్డింగ్ చేసిన తర్వాత తల (head stuck between iron bars) కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎంత తీయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.


ఇదంతా వ్యూస్ కోసం చేశాడో, లేక అనుకోకుండా చేశాడో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మూర్ఖత్వం అంటే ఇదే’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60కి పైగా లైక్‌లు, 10 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 04:36 PM