Share News

Train Accident Video: రైల్వే ట్రాక్స్‌పై జెండాతో రీల్స్ చేశాడు.. చివరకు చూస్తుండగానే..

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:46 PM

మౌలానా అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్‌ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Train Accident Video: రైల్వే ట్రాక్స్‌పై జెండాతో రీల్స్ చేశాడు.. చివరకు చూస్తుండగానే..

రైల్వే ట్రాక్స్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అనేక మంది ప్రాణాలు పోగొట్టుకోవడం తరచూ చూస్తున్నాం. అయినా యువకుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే ట్రాక్స్‌ మధ్యలో పడుకుని కొందరు, రైలు వచ్చే ముందు పట్టాలకు సమీపంలో నిలబడి మరికొందరు సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విషాద సంఘటనలకు సంబంధించిన వీడియోలను కూడా నిత్యం చూస్తున్నాం. తాజాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు జెండా పట్టుకుని రైలు పట్టాల పక్కన నడుస్తూ వెళ్తున్నాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇండోనేషియాలో (Indonesia) ఈ ఘటన చోటు చేసుకుంది. మిజా గని మౌలానా ఫిర్దౌస్ (21) అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్‌ పైకి వెళ్లాడు. మౌలానా తన చేతిలో జెండా పట్టుకుని రైల్వే ట్రాక్స్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. దూరంగా ఉన్న అతడి స్నేహితుడు నానాంగ్ వీడియో తీస్తున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సదరు యువకుడు జెండా పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా.. అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు (Train hits young man) అతన్ని ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో మౌలానా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసి వీడియో తీస్తున్న అతడి స్నేహితుడు షాక్ అయ్యాడు. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, సురబయ గుబెంగ్ నుంచి జకార్తాలోని పసార్ సెనెన్ వైపు వెళ్తున్న జయకార్తా రైలు అతడిని ఢీకొట్టింది.


ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదమని తెలిసినా చాలా మందిలో మార్పు రావడం లేదు’.. అంటూ కొందరు, ‘తెలిసి తెలిసి ప్రాణాలు కోల్పోవడమంటే ఇదే’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 09:09 PM