Auto Stunt Video: ఆటోపై డేంజరస్ స్టంట్.. చివరకు యువకుల పరిస్థితి ఏమైందంటే..
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:52 PM
థానే-బేలాపూర్ రోడ్డులో ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేశాడు. మెకానిక్‌గా పని చేసే షంషుద్ అహ్మద్, ఆటో డ్రైవర్ అక్షయ్ ధోత్రే అనే ఇద్దరు యువకులు.. అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చారు. తర్వాత డేంజరస్ స్టంట్స్ చేసి వీడియో తీశారు. చివరకు ఏమైందంటే..
వాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేసే వారిని నిత్యం చూస్తుంటాం. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా డేంజరస్ స్టంట్స్ చేస్తుంటారు. ఇంకొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, నవీ ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆటోపై డేంజరస్ స్టంట్ చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నవీ ముంబైలో (Navi Mumbai) ఈ ఘటన చోటు చేసుకుంది. థానే-బేలాపూర్ రోడ్డులో ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేశాడు. మెకానిక్‌గా పని చేసే షంషుద్ అహ్మద్, ఆటో డ్రైవర్ అక్షయ్ ధోత్రే అనే ఇద్దరు యువకులు.. శనివారం అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చారు. ఆటోను (Dangerous stunt on auto) రోడ్డుపై గుండ్రంగా తిప్పారు.
ఆ తర్వాత అహ్మద్ అనే వ్యక్తి స్టీరింగ్ వదిలేసి, ఆటోపై కూర్చున్నాడు. డ్రైవర్ లేకుండానే ఆటో గుండ్రంగా తిరుగుతుండగా.. ఆ యువకుడు పైన కూర్చుని కెమెరాకు ఫోజులు ఇస్తున్నాడు. ధోత్రే అనే యువకుడు ఈ విన్యాసాన్ని మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో చివరకు పోలీసుల వరకూ వెళ్లింది. ఆటో నంబర్ ఆధారంగా పోలీసులు.. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేసినందుకు గాను వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
వారు చేసిన పనికి పోలీస్ స్టేషన్‌లో కెమెరా ముందు క్షమాపణలు చెప్పించి వీడియో తీయించారు. భవిషత్తులో ఇలాంటి పనులు ఎప్పుడూ చేయమని, ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దని కూడా వారితో చెప్పించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి విన్యాసాలు చేయడం ప్రమాదకరం’.. అంటూ కొందరు, ‘ఇలాటి వారిని కఠినంగా శిక్షిస్తే.. మరొకరు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి