Train Funy Viral Video: వామ్మో.. ఈమె చోరీ మామూలుగా లేదుగా.. ఎంత తెలివిగా కొట్టేసిందో చూస్తే..
ABN , Publish Date - Aug 09 , 2025 | 10:06 PM
లక్నోలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి భూత్‌నాథ్ మార్కెట్‌లో ఈ ఘనట చోటు చేసుకుంది. స్థానిక జ్యవెలర్ దుకాణంలో జరిగిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు..
దొంగతనాలు చేయడంలో ఒక్కో దొంగ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు వీడియోలు చూసి తెలివిగా చోరీ చేస్తే.. మరికొందరు పక్కనే నిలబడి మనకు తెలీకుండానే మన పర్సులు కొట్టేస్తుంటారు. ఇంకొందరు అమాయకంగా నటిస్తూ చివరకు అంత అవాక్కయ్యేలా చోరీలు చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బంగారు షాపులోకి వెళ్లిన ఓ మహిళ.. చివరకు ఎంతో తెలివిగా చోరీ చేసింది. ఈమె నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లక్నోలోని (Uttar Pradesh, Lucknow) ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి భూత్‌నాథ్ మార్కెట్‌లో ఈ ఘనట చోటు చేసుకుంది. స్థానిక జ్యవెలర్ దుకాణంలో జరిగిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. దుకాణంలోకి వచ్చిన ఓ మహిళ.. కస్టమర్లతో పాటూ అక్కడే నిలబడి చెవిపోగులు చూస్తోంది.
దుకాణ యజమాని ఆమెకు వివిధ రకాల చెవిపోగులను చూపిస్తున్నాడు. అయితే ఇంతలో ఆ మహిళ.. ఎంతో చాకచక్యంగా చెవి పోగులను తీసుకుని కిందపడేసింది. ఆ తర్వాత తన వస్తువు కోసం కింద వెతుకుతున్నట్లు నటించింది. ఈ క్రమంలో చెవిపోగులు తీసుకుని, అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఫైనల్‌గా చెవిపోగులు కనిపించకోపోవడంతో సీసీ ఫుటేజ్ చూడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న ఘాజీపూర్ పోలీసులు.. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
కాగా, చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఈమె చోరీ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇలాంటి వారు మన చుట్టూనే ఉంటారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి