Share News

Funny Viral Photo: శాఖాహార హోటల్ అని తినేందుకు వెళ్లారు.. బోర్డుపై రాసింది చూసి ఖంగుతిన్నారు..

ABN , Publish Date - Aug 09 , 2025 | 02:56 PM

ఓ వ్యక్తి రోడ్డు పక్కన బండిపై చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ఆ హోటల్ బోర్డుపై .. ఇది ప్యూర్ వెజిటేరియన్ మోటల్.. అని రాయించాడు. దీంతో వెజిటేరియన్స్ మొత్తం ఆ హోటల్‌ వైపు క్యూ కట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది..

Funny Viral Photo: శాఖాహార హోటల్ అని తినేందుకు వెళ్లారు.. బోర్డుపై రాసింది చూసి ఖంగుతిన్నారు..

ఒకప్పుడు సినిమాల్లో కనిపించే వింతలు, విశేషాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే సంఘటనలు కూడా దర్శనమిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు, ఫొటోలు చూసినప్పుడు.. కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వీడియాలు ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అని బోర్డు చూసి వెళ్లిన వారికి.. హోటల్ యజమానికి షాక్ ఇచ్చాడు. బోర్డుపై రాసింది మొత్తం చదివి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన బండిపై చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ఆ హోటల్ బోర్డుపై ‘ఇది ప్యూర్ వెజిటేరియన్ మోటల్’.. (Vegetarian Hotel) అని రాయించాడు. దీంతో వెజిటేరియన్స్ మొత్తం ఆ హోటల్‌ వైపు క్యూ కట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది.


హోటల్‌ దగ్గరికి వెళ్లిన వారు.. బోర్డుపై ఉన్న సందేశాన్ని మొత్తం చదివి షాక్ అవుతున్నారు. వెజిటేరియన్ అని రాసిన అక్షరాల కిందే.. గుడ్డు కర్రీ, చికెన్ కర్రీ అని రాసి.. (Chicken and egg curry) రూ.80, రూ.120 అని రేట్లు కూడా రాసి పెట్టాడు. ఈ బోర్డు మొత్తం చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. హోటల్ యజమాని వైపు గుర్రుగా చూసి.. చేసేదేమీ లేక పక్క హోటల్‌కు వెళ్తున్నారు. మొత్తానికి ఈ హోటల్‌ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ప్లేటులో చికెన్, గుడ్డు వడ్డించే హోటల్ ఉంటే.. దాన్ని వెజిటేరియన్ హోటల్ అని అంటారన్నమాట’.. అంటూ కొందరు, ‘చికెన్, గుడ్డుతో పాటూ కొంచెం మందు కూడా ఉంటే బాగుండు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 44కి పైగా లైక్‌లు, 1300కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 02:56 PM