Share News

Swan Heart Touching Video: నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:04 PM

నీటిలో ఓ హంస నిర్జీవంగా పడి ఉంటుంది. ఇంతలో దాని భాగస్వామి అటుగా వస్తుంది. తన భాగస్వామి చలనం లేకుండా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. చివరకు అది చేసిన పని చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Swan Heart Touching Video: నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

ప్రేమకు అసలైన చిహ్నాలు హంసలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ భాగస్వాముల పట్ల హంసలు ఎంతో ప్రేమానురాగాలను కలిగి ఉంటాయనే విషయం తెలిసిందే. తమ భాగస్వామి చనిపోయిన సందర్భాల్లో మిగతా హంసలు ఎంతో బాధపడిపోతుంటాయి. ఒకానొక సందర్భంలో బాధతో అవి కూడా ప్రాణాలు వదిలేస్తుంటాయి. హంసల గురించి మనం విన్న ఈ కథలు కొన్నిసార్లు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతుంటాయి. తాజాగా, ఓ హంసకు సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చనిపోయిన హంసను చూసి భాగస్వామి.. దాన్ని పైకి లేపేందుకు ఎంతో ప్రయత్నించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో.. ఈ హంసకు ఎంత కష్టం వచ్చింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటిలో ఓ హంస నిర్జీవంగా పడి ఉంటుంది. ఇంతలో దాని భాగస్వామి అటుగా వస్తుంది. తన భాగస్వామి చలనం లేకుండా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. మనుషుల్లాగానే ఎంతో బాధపడి, దాని చుట్టూ తిరుగుతుంది. ముక్కతో దాన్ని పదే పదే తడుతూ పైకి లేపేందుకు ప్రయత్నిస్తుంది.


అయితే అప్పటికే ఆ హంస ప్రాణాలు కోల్పోవడంతో ఎంత ప్రయత్నించినా పైకి లేవదు. అయినా ఆ హంస.. దాన్ని పైకి లేపేందుకు (swan trying to wake up its dead partner) ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇలా చాలా సేపు ఆ హంస తన భాగస్వామిని పైకి లేపేందుకు ప్రయత్నించడం చూసి అక్కడున్న వారంతా.. అయ్యో.. పాపం.. అంటూ బాధపడిపోయారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘నిజమైన ప్రేమకు.. ఇదే నిదర్శనం’.. అంటూ కొందరు, ‘చాలా బాధాకరం.. నిజమైన ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌‌లు, 19 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 09:05 PM