Share News

Funny Viral Video: విదేశీ మహిళ ముందు అంకుల్ తిప్పలు.. ఎదురుగా కూర్చుని ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:11 PM

ఓ విదేశీయురాలు హోటల్లో మిసల్ పావ్ అనే బ్రెడ్‌తో చేసిన వంటకాన్ని ఆర్డర్ ఇచ్చింది. ఆమె ఎదురుగా కూర్చున్న అంకుల్.. సమోసా ఆర్డర్ చేశాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Funny Viral Video: విదేశీ మహిళ ముందు అంకుల్ తిప్పలు.. ఎదురుగా కూర్చుని ఏం చేస్తున్నాడో చూడండి..

కొందరు ఎదుటి వారి ముందు హుందాగా కనిపించాలనే ఉద్దేశంతో చేసే పనులు.. కొన్నిసార్లు సమస్యలను తెచ్చిపెడుతుంటాయి. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. హోటల్లో సమోసా తింటున్న అంకుల్ ఎదురుగా ఓ విదేశాయురాలు కూర్చుంది. ఆమె ముందు హుందాగా ఉండాలనే ఉద్దేశంతో అతను చేసిన నిర్వాకం అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ విదేశీయురాలు (foreigner) హోటల్లో మిసల్ పావ్ అనే బ్రెడ్‌తో చేసిన వంటకాన్ని ఆర్డర్ ఇచ్చింది. ఆమె ఎదురుగా కూర్చున్న అంకుల్.. సమోసా ఆర్డర్ చేశాడు. బ్రెడ్ రాగానే సదరు మహిళ.. వారి పద్ధతిలో స్పూన్‌తో కూరను తీసుకుని బ్రెడ్ మధ్యలో పెట్టి తింటుంది.


ఇదంతా గమనించిన అంకుల్.. ఆమె ముందు తన పరువు పోకూడదు అనుకున్నాడో ఏమో గానీ.. సమోసాను చేత్తో తినకుండా వినూత్నంగా తినడం స్టార్ట్ చేశాడు. ఫోర్క్, స్పూన్ పట్టుకుని సమోసాను అటూ, ఇటూ తిప్పుతూ (Uncle eating samosa) అతి కష్టం మీద కట్ చేస్తూ తినసాగాడు. అలా తినడం అతడికి ఎంతో ఇబ్బందిగా ఉన్నా కూడా.. పరువు పోకూడదనే ఎద్దేశంతో అలా తెలివిగా మ్యానేజ్ చేశాడు. ఇలా సమోసాలను ఎలాగోలా ఫారెన్ పద్ధతిలో తినడం ముగించేశాడన్నమాట.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ అంకుల్ టాలెంట్‌కు సెల్యూట్ చేయాల్సిందే’.. అంటూ కొందరు, ‘భారతీయుల పరువు నిలబట్టేందుకు ప్రయత్నించాడు.. గ్రేట్’.. అంటూ మరికొందరు, వివి రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76 వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 04:23 PM