Bus Accident Video: బస్సులో ఇలా కూర్చుంటున్నారా.. తల్లి ఒడిలోని ఈ చిన్నారికి ఏమైందో చూస్తే..
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:03 PM
మదన్‌కుమార్ అనే వ్యక్తి.. తన చెల్లెలు, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం బస్సు ఎక్కాడు. బస్సు డోరు పక్కనే కూరచున్న ముత్తురామలింగపురం చెల్లెలు.. తన ఒడిలో ఏడాది వయసున్న తన కూతురును కూర్చోబెట్టుకుంది. అయితే మార్గమధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదంలో పడుతుంటే.. మరికొన్నిసార్లు పక్క వారి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన ఒడిలో పిల్లాడిని పెట్టుకుని డోరు వద్ద కూర్చుంది. అయితే మార్గ మద్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులోని (Tamil Nadu) విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముత్తురామలింగపురం ప్రాంతానికి చెందిన మదన్‌కుమార్ అనే వ్యక్తి.. తన చెల్లెలు, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం బస్సు ఎక్కాడు. బస్సు డోరు పక్కనే కూరచున్న ముత్తురామలింగపురం చెల్లెలు.. తన ఒడిలో ఏడాది వయసున్న తన కూతురును కూర్చోబెట్టుకుంది.
అలాగే ముత్తరామలింగం తన ఒడిలో.. చెల్లెలు రెండేళ్ల కొడుకును కూర్చోబెట్టుకున్నాడు. ఇదిలావుండగా.. బస్సు మీనాక్షిపురం సిగ్నల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ సడన్ బ్రేకులు వేశాడు. దీంతో తల్లి ఒడిలో ఉన్న చిన్నారి ఎగిరి (Child Fall From Bus) తలుపు గుండా కిందపడిపోయింది. అలాగే మదన్‌కుమార్‌తో పాటూ బాలుడు కూడా ముందుకు తూలిపడ్డారు. తన ఒడిలోని కూతురు రోడ్డుపై పడిపోవడంతో ఆ తల్లి షాక్ అయింది. కంగారుపడుతూ బస్సులో నుంచి దిగి కిందకు వెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో పాప.. స్వల్పగాయాలతో బయటపడింది. ప్రస్తుతం పాప వైద్యుల పర్యవేక్షణలో ఉంది.
అలాగే ఈ ఘటనలో బాలుడిని కాపాడబోయి మదన్‌కుమార్ కూడా గాయపడ్డాడు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించారా, డ్రైవర్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. తదితర వివరాలు తెలియరాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘డోరు పక్కన కూర్చున్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ కొందరు, ‘సడన్ బ్రేక్ వేయడం డ్రైవర్ తప్పు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100 లైక్‌లు, 2.84 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..
నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి