Share News

Child Funny Viral Video: బాహుబలిని మరిపించాడుగా.. ఈ బుడ్డోడి బలం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Aug 05 , 2025 | 09:31 PM

బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్.. పెద్ద రథాన్ని ఒక్కడే లాక్కుని వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఓ బుడ్డోడు ఈ సీన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో ఏమో గానీ.. వినూత్న విన్యాసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు..

Child Funny Viral Video: బాహుబలిని మరిపించాడుగా.. ఈ బుడ్డోడి బలం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సోషల్ మీడియా ప్రస్తుతం వింతలు, విశేషాలకు నిలయంగా మారుతోంది. సినిమాల్లో కనిపించే సీన్లన్నీ నెట్టింట వీడియోల రూపంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో వింత వింత విన్యాసాలు, వినూత్న ప్రయోగాలు, ఫన్నీ ప్రాంక్‌లు తదితర వీడియోలు అందరినీ తెగ నవ్విస్తుంటాయి. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ చిన్నారి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నడవడం కూడా రాని ఈ బుడ్డోడు చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. బాహుబలిని మరిపించాడుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బాహుబలి సినిమాలో (Bahubali movie scene) హీరో ప్రభాస్.. పెద్ద రథాన్ని ఒక్కడే లాక్కుని వచ్చే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీన్ అందరికీ తెగ నచ్చేయడంతో చాలా మంది దీనిపై కామెడీ వీడియోలు కూడా తీయడం చూశాం. అయితే ఓ బుడ్డోడు ఈ సీన్ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో ఏమో గానీ.. తాను కూడా ఇలాగే చేయాలని ఫిక్స్ అయ్యాడు.


తన సోదరి కూర్చున్న చక్రాల కుర్చీ కిందకు జోకాడుతూ వెళ్లాడు. సరిగ్గా లేచి నిలబడలేని స్థితిలో ఉన్నా కూడా.. ఎలాగోలా పైకి లేచి కుర్చీ మధ్యలో ఉన్న ఇనుప రాడ్ పట్టుకున్నాడు. తర్వాత అచ్చం హీరో ప్రభాస్ మాదిరే కుర్చీని (Child Pushed The Chair) ముందుకు తోసుకుంటూ వెళ్లాడు. అంత బరువు ఉన్న కుర్చీని కూడా ఈ బుడ్డోడు ఎంతో అవలీలగా ముందుకు తోసుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో ఈ బుడ్డోడిపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. బుడ్డోడి బలం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘బాహుబలిని మరిపించాడుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 10 వేలకు పైగా లైక్‌లు, 1.90 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 09:31 PM