Road Accident Viral Video: సైక్లిస్ట్ చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదానికి ఎలా కారణమైందో చూడండి..
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:00 PM
ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నారు. అతడికి ముందు వైపు ఓ ట్రాక్టర్ కూడా వెళ్తోంది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. ట్రాక్టర్ వెనుకే మెల్లిగా వెళ్తున్నాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
రోడ్డు ప్రమాదాల్లో తొంభై శాతం కేవలం నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతో మందిని ప్రాణాలు తీసే వరకూ వెళ్తుంటుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ సైక్లిస్ట్ నిర్లక్ష్యం చివరకు పెద్ద ప్రమాదానికి ఎలా కారణమైందో మీరే చూడండి..
ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నారు. అతడికి ముందు వైపు ఓ ట్రాక్టర్ కూడా వెళ్తోంది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. ట్రాక్టర్ వెనుకే మెల్లిగా వెళ్తున్నాడు.
అయితే కాస్త దూరం వెళ్లగానే ఉన్నట్టుండి మనసు మార్చుకుని.. సైకిల్‌ను వెనక్కు మళ్లించాడు. అదే సమయంలో ఎదురుగా ఓ ఆటో కూడా వేగంగా వస్తుంటుంది. సైకిల్‌ను సడన్‌గా రోడ్డుకు అవతలి వైపునకు మళ్లించడంతో.. ఆటో నేరుగా వచ్చి సైకిల్‌ను ఢీకొట్టి (Auto fell down) ముందుకు వెళ్లి పడిపోయింది. ఈ ఘటనలో సైకిల్‌పై ఉన్న వ్యక్తితో పాటూ ఆటోలో ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. సైక్లిస్ట్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే విషయం వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఘటన మొత్తం అక్కడే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నాు. ‘సైక్లిస్ట్ తప్పిదం వల్లే ఇంత ప్రమాదం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి తప్పు ఎవరూ చేయొద్దు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 2.25 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..
నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి