Share News

Physiotherapist Viral Video: అరే ఇదేంటీ..! ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ గొంతుపై నొక్కగానే..

ABN , Publish Date - Aug 06 , 2025 | 06:11 PM

ఓ ఫిజియోథెరపిస్ట్ తన వద్దకు వచ్చిన మహిళా రోగిని పరిశీలిస్తాడు. ఈ క్రమంలో అతను ఆమెను కూర్చోబెట్టి, మెడపై చేతులు పెట్టి ప్రెస్ చేస్తాడు. రెండు వేళ్లతో నొక్కగానే కాసేపటికి ఆమెలో సడన్‌గా మార్పులు చోటు చేసుకుంటాయి. చివరకు ఏమైందో చూడండి..

Physiotherapist Viral Video: అరే ఇదేంటీ..! ఇలాక్కూడా జరుగుతుందా.. మహిళ గొంతుపై నొక్కగానే..

ఫిజియోథెరపీతో అనేక సమస్యలు పరిష్కారమవుతాయనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఎంతో మంది ఫిజియోథెరపీ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. శరీర భాగాలపై సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ సమస్యను తగ్గించేందుకు నిపుణులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫిజియోథెరపీ చేయించుకుంటుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళ మెడపై చేతులతో ప్రెస్ చేయగానే ఒక్కసారిగా మహిళ కిందపడిపోయింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఫిజియోథెరపిస్ట్ తన వద్దకు వచ్చిన మహిళా రోగిని పరిశీలిస్తాడు. ఈ క్రమంలో అతను ఆమెను కూర్చోబెట్టి, మెడపై చేతులు పెట్టి ప్రెస్ చేస్తాడు. రెండు వేళ్లతో నొక్కగానే కాసేపటికి ఆమెలో సడన్‌గా మార్పులు చోటు చేసుకుంటాయి.


అప్పటిదాకా హుషారుగా ఉన్న ఆమె, చేతి వేళ్లతో ప్రెస్ చేయగానే.. (Physiotherapist presses on woman throat) ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయింది. వీడియో చూస్తుంటే.. ఆమె ప్రాణాలు పోయినట్లుగా చూపించారు. అయితే ఇది నమ్మశక్యంగా లేకున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈమె యాక్టింగ్ బాగా చేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి ఫేక్ వీడియోలతో జనాలను ఎందుకు మోసం చేస్తారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 వేలకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

నీళ్లలోని మొసలికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. జీపు కింద పడడంతో చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 06:11 PM