Funny Viral Photo: టీ దుకాణంలో దొంగల కోసం సూచన.. ఏం రాశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Aug 08 , 2025 | 08:33 PM
తమ ఇళ్లు, దుకాణాల ముందు వింత వింత సందేశాలు రాయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓ స్త్రీ రేపురా.. బంగారం, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి.. వంటి చిత్రవిచిత్రమైన సందేశాలను రాయడం చూస్తుంటాం. అలాగే తాజాగా..
వింత వింత చోరీల గురించి తరచూ వింటూ ఉంటాం. కొందరు దొంగలు చోరీకి వెళ్లి.. అదే ఇంట్లో స్నానాలు, భోజనాలు చేస్తుంటారు. అలాగే మరికొన్నిసార్లు చోరీకి వెళ్లిన దొంగలు.. యజమానిపై జాలిపడి కొంత నగదును ఉంచి వెళ్లడం కూడా చూశాం. అలాగే మరికొందరు దొంగలు చోరీ చేసిన ఇంట్లో సందేశం రాసి వెళ్లడం కూడా చూశాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన టీ దుకాణం ముందు దొంగల కోసం ఓ సందేశం రాసి ఉంచాడు. ఈ ఫొటో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. తమ ఇళ్లు, దుకాణాల ముందు వింత వింత సందేశాలు రాయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓ స్త్రీ రేపురా.. బంగారం, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి.. వంటి చిత్రవిచిత్రమైన సందేశాలను రాయడం చూస్తుంటాం. అలాగే తాజాగా ఓ టీ దుకాణ యజమానికి.. దొంగలు రాకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించాడు.
చివరకు తన దుకాణం ముందు వినూత్నమైన సందేశంతో (Message to thieves in front of shop) కూడిన పేపర్ అంటించాడు. ఆ సందేశం చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ‘దొంగలకు ముఖ్యమైన సందేశం. ఈ దుకాణంలోని వస్తువులన్నీ ఇంటికి తీసుకెళ్లాం. కాబట్టి రాత్రి వేళ్లలో మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. తాళం పగులగొడితే.. వెల్డింగ్‌కు రూ.500 ఖర్చవుతుంది’.. అని రాసుకొచ్చాడు. ఈ సందేశం చూసిన వారంతా ఫక్కున నవ్వుకుంటున్నారు.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ నోటీస్ చూసిన దొంగ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఈ దుకాణ యజమాని తెలివి మామూలుగా లేదుగా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 90కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి