Share News

Woman Reels Video: వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:40 PM

ఓ మహిళ తన భర్త ఎదురుగా రీల్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో కోపం రావడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

Woman Reels Video: వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. కొందరైతే నిత్యం అదే పనిలో మునిగిపోతున్నారు. మరికొందరు ఏదోటి చేసి, ఎలాగైనా వ్యూస్, లైకులు తెచ్చుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తుంటే.. మరికొన్నిసార్లు ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. మహిళపై మండిపడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన భర్త ఎదురుగా రీల్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో కోపం రావడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు అందరికీ ఆగ్రహం తెప్పిస్తున్నాయి.


ఫోన్ ఆన్ చేసి భర్త ఎదురుగా నిల్చుంది. దివ్యాంగుడైన ఆమె భర్త.. మంచంపై నుంచి ఊతకర్రల సాయంతో పైకి లేచి నిలబడతాడు. అయితే ఈ క్రమంలో భార్య మాట్లాడుతూ.. ‘భర్త కాళ్ల దగ్గర స్వర్గం ఉంటుందని అంటుంటారు.. కానీ నా భర్తకు కాళ్లే లేవు’.. అని వ్యంగ్యంగా మాట్లాడుతూ (Wife jokes about husband's disability) వెకిలి నవ్వులు నవ్వుతుంది. దీన్నంతా వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వ్యూస్ కోసం భర్త వైకల్యాన్ని ఎగతాళి చేయడం సిగ్గుచేటు’.. అంటూ కొందరు, ‘లైక్‌లు, వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు’.. అంటూ మరికొందరు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 1900 మందికి పైగా వీక్షించారు.


ఇవి కూడా చదవండి..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

ఆహా.. అవ్వా..! నీ తెలివికి జోహార్లు.. ఫ్రిడ్జ్‌ను ఎలా వాడిందో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 03:40 PM