Share News

Train Accident Video: రైలు ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Aug 07 , 2025 | 09:43 PM

ఓ వ్యక్తి వినూత్నంగా రీల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో చివరకు రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. రైలు రావడం చూసి.. దాని పక్కగా నడుచుకుంటూ వెళ్తూ రీల్ చేయాలని చూశాడు. అయితే..

Train Accident Video: రైలు ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జరిగింది చూసి ఖంగుతిన్నాడు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకూ అంతా రీల్స్ పిచ్చిలో మునిగిపోతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఇంకొందరు కదులుతున్న బస్సు, రైళ్లలో డేంజరస్ స్టంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలు ముందు నడుచుకుంటూ వెళ్తూ రీల్స్ చేయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వినూత్నంగా రీల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో చివరకు రైల్వే ట్రాక్‌ పైకి వెళ్లాడు. రైలు రావడం చూసి.. దాని పక్కగా నడుచుకుంటూ (Reels on the railway track) వెళ్తూ రీల్ చేయాలని చూశాడు. అయితే రైలు సమీపానికి రాగానే ఢీకొని ధబేల్‌మని కిందపడిపోయాడు.


తర్వాత షాక్ నుంచి తేరుకుని పక్కకు పాక్కుంటూ వెళ్లాడు. ఈ ప్రమాదంలో అతడి భుజానికి (man hit by train) బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. రైలు వచ్చే సమయంలో ఏమాత్రం అటూ, ఇటూ అయినా ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. అయితే చివరకు గాయాలతో బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ముందు ప్రమాదకరంగా నడుస్తూ రీల్స్ చేయడంతో అంతా మండిపడుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలా చేసే వారికి ఇలాగే జరగాలి’.. అంటూ కొందరు, ‘ఇలా రైలు పట్టాలపై రీల్స్ చేయడం చాలా డేంజర్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 90కి పైగా లైక్‌లు, 1600కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 09:43 PM