Elephant Helping Video: ఏనుగు ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడు.. సమీపానికి వచ్చిన గజరాజు.. చివరకు..
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:33 PM
చాలా మంది సందర్శకులు జూలో జంతువులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో కొందరు ఏనుగు ఎన్‌క్లోజర్‌పై నిలబడి చూస్తున్నారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
ఏనుగులు ఎంత భారీగా ఉంటాయో.. అంతే సహనంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు అంతే స్థాయిలో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మంచితనానికి మారు పేరుగా నిలుస్తుంటాయి. ఆపద సమయాల్లో మనుషులకు సాయం చేసే ఏనుగులను తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు ఏనుగు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది సందర్శకులు జూలో జంతువులను చూసేందుకు వెళ్లారు. ఇంతలో కొందరు ఏనుగు ఎన్‌క్లోజర్‌పై (Elephant enclosure) నిలబడి చూస్తున్నారు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలు జారి ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు.
పిల్లాడు లోపల పడిపోవడం చూసి ఏనుగు సమీపానికి వెళ్లింది. పిల్లాడిపై ఆ ఏనుగు దాడి చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. అయితే సమీపానికి వచ్చిన ఏనుగు.. ఆ పిల్లాడిని తొండంతో పట్టుకుని పైకి లేపింది. ఆ తర్వాత అలాగే పైకి ఎత్తుకుని ఎన్‌క్లోజర్ పైన ఉన్న (Elephant Saved the child) పర్యాటకులకు అందించింది. కిందపడిపోయిన తమ కొడుకును.. ఇలా ఏనుగుకే తమకు అందించడం చూసి పిల్లాడి తండ్రిదండ్రులతో పాటూ అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు. అయితే ఈ వీడియో ఏఐతో క్రియేట్ చేసిందంటూ కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగు మంచితనం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘బాగా గమనిస్తే.. ఇది ఏఐ అని అర్థమవుతుంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 23 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
వ్యూస్ కోసం భర్త అని కూడా చూడకుండా.. ఎలాంటి కామెంట్స్ చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి