Share News

Floods Viral Video: వరద నీటిలో అదుపు తప్పిన కారు.. సడన్‌గా కిందకు దూకేసిన వ్యక్తి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:16 PM

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో కారు రోడ్డు దాటుతుండగా.. మధ్యలో వాగు అడ్డొచ్చింది. వాగులో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. అయినా..

Floods Viral Video: వరద నీటిలో అదుపు తప్పిన కారు.. సడన్‌గా కిందకు దూకేసిన వ్యక్తి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో వరద దాటికి ఇళ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇక వాహనదారుల ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా వాగులు దాటే సమయంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు వాగు దాటుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారు మునిగిపోతోందని ఓ వ్యకి కిందకు దూకేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఎక్కడ జరిగిందో ఏమో గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో కారు రోడ్డు దాటుతుండగా.. మధ్యలో వాగు అడ్డొచ్చింది. వాగులో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. అయినా కారు డ్రైవర్.. వాహనాన్ని నీటిలోకి దింపేశాడు.


అయితే వాగు మధ్యలోకి వెళ్లగానే.. కారు అదుపు తప్పింది. వాహనం వెనక్కు జరుగుతుండడంతో లోపల ఉన్న వారు భయపడిపోయారు. వాహనంలో ముందున్న ఓ వ్యక్తి.. భయంతో కిందకు దూకేశాడు. అయితే అతను కిందకు దూకేసిన కొద్ది సేపటి తర్వాత.. డ్రైవర్ వాహనాన్ని ఎలాగోలా మళ్లీ కంట్రోల్‌లోకి తెచ్చి, వాగు అవతలి వైపునకు తీసుకెళ్లాడు. దీంతో కారులో ఉన్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.


కారు నుంచి ఆ వ్యక్తి దూకేయడం చూసి.. చుట్టూ ఉన్న వారు పరుగుల తీస్తూ అక్కడికి వెళ్లారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కంగారులో దూకేస్తే.. ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 05:16 PM