Share News

Snake VS Lions: సింహాలకు ఎదురెళ్లిన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN , Publish Date - Aug 09 , 2025 | 09:05 PM

రెండు సింహాలు అడవిలోని రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము వాటికి ఎదురుగా వస్తుంది. పామును చూడగానే సింహాలు రెండూ ఒక్కసారిగా ఆగిపోయాయి..

Snake VS Lions: సింహాలకు ఎదురెళ్లిన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

సింహాలు వస్తున్నాయంటే.. ఎదురుగా ఏ జంతువు ఉన్నా సరే పక్కకు తప్పుకోవాల్సిందే. అందుకే సింహాన్ని అడవికి రాజు అని అంటుంటారు. అయితే కొన్నిసార్లు సింహాలు కూడా భయపడే సందర్భాలు వస్తుంటాయి. అది కూడా చిన్న చిన్న జీవులకు భయపడి పారిపోయే సందర్భాలను చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రెండు సింహాలకు ఓ నాగు పాము ఎదురు వచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు సింహాలు అడవిలోని రోడ్డుపై తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మార్గ మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము వాటికి ఎదురుగా వస్తుంది. పామును చూడగానే సింహాలు (Lion stopped in front of cobra) రెండూ ఒక్కసారిగా ఆగిపోయాయి. సింహాలను గమనించిన నాగు పాము కూడా అక్కడే ఆగి.. దగ్గరికి వస్తే కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది.


సింహాలు కాలు కదపడానికి కూడా భయపడిపోతాయి. ‘బతికుంటే బలిశాకు తినొచ్చు.. కాలు ముందుకేసి కాటేయించుకోవడం కంటే.. సైలెంట్‌గా ఉండడం బెటర్’.. అని అనుకున్నట్లుగా కదలకుండా అలాగే నిలబడి ఉంటాయి. ఇలా కొద్ది సేపటి తర్వాత.. ఆ పాము అక్కడి నంచి మెల్లగా రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఓ తొండ రోడ్డుపైకి వచ్చి ఆగుతుంది. అప్పటిదాకా పామును చూసిన భయంలో ఉన్న సింహాలు.. తొండను చూసి కూడా అదే భయంతో ఉంటాయి.


కనీసం ఆ తొండను తాకడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. ఇలా రెండు సింహాలకు పాము చుక్కలు చూపించడం చూసి అక్కడున్న పర్యాటకులు అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘సింహాలు చుక్కలు చూపించిన నాగుపాము’.. అంటూ కొందరు, ‘నాగుపాముతో అంటే ఈ మాత్రం ఉండాలి మరి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 93 వేలకు పైగా లైక్‌‌లు, 7.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 09:05 PM