Watch Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేయాలి.. పార్క్‌లో యువతికి సమీపంలో..
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:33 PM
దాదర్‌లోని ఛత్రపతి శివాజీ పార్క్ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. దాదార్‌లోనే ప్రముఖమైన ఈ పార్క్‌ను నిత్యం అనేక మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సందర్శిస్తుంటారు. ఈ ఇటీవల ఈ పార్క్‌లో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది..
కొందరు చేసే పనులు అందరికీ ఆదర్శనంగా నిలుస్తుంటే.. మరికొందరు చేసే పనులు అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటాయి. ఇంకొందరైతే.. కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తుంటారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అందరితో ఛీ కొట్టించుకుంటుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పార్క్‌లో యువతికి సమీపంలో చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముంబై (Mumbai) దాదర్‌లోని ఛత్రపతి శివాజీ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పార్క్ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. దాదార్‌లోనే ప్రముఖమైన ఈ పార్క్‌ను నిత్యం అనేక మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సందర్శిస్తుంటారు. ఈ ఇటీవల ఈ పార్క్‌లో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
పార్క్‌లోని బెంచ్ మీద ఓ యువతి (young woman) కూర్చుని ఉండగా.. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి, ఆమెకు సమీపంలోనే (Man urinating in park) నిలబడి మూత్రవిసర్జన చేస్తున్నాడు. మహిళలు ఉన్నారనే విషయం తెలిసి కూడా అతను అక్కడే మూత్రవిసర్జన చేస్తున్నాడు. ఈ ఘటనతో అక్కడున్న యువతితో పాటూ మిగతా వారంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఓ వ్యక్తి ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’..అంటూ కొందరు, ‘వీడియో తీస్తున్న వ్యక్తి.. వెళ్లి వారించవచ్చు కదా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 2.29 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..
నిర్జీవంగా పడి ఉన్న భాగస్వామి.. గమనించిన హంస చివరకు ఏం చేసిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి